Punjab vs Bangalore: బెంగళూరుపై పులి.. ఇతర జట్లపై పిల్లి.. పంజాబ్‌పై విమర్శలు
ఇంటర్నెట్‌డెస్క్: భారత టీ20 లీగ్‌లో ఇప్పటివరకు ట్రోఫీ అందుకోని వాటిల్లో బెంగళూరు, పంజాబ్ జట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టోర్నీ ప్రారంభమై 15 సీజన్లు పూర్తికావస్తున్నా ఇంకా తొలి కప్పు కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి. అయితే, గత మూడేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో పంజాబ్‌దే ఆధిపత్యం. గతరాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 160 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేకపోయినా.. ఈ సీజన్లో బెంగళూరుపై రెండు సార్లు 200పైచిలుకు పరుగులు చేసి విజయాలు సాధించింది. అలాగే గత మూడేళ్లలో ఈ రెండు జట్లు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలుపొందింది. దీంతో ఇతర జట్లతో పిల్లిలా ఉండే పంజాబ్.. బెంగళూరుపై పులిలా చెలరేగుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. బెంగళూరు అవకాశాలను దెబ్బతీయడానికే పంజాబ్ ఆడుతున్నట్లుందని ఆ జట్టు అభిమానులు మండి పడుతున్నారు. మీమ్స్‌తోనూ అలరిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
India News
Tiranga Yatra: తిరంగా యాత్ర పైకి దూసుకెళ్లిన ఆవు.. గాయపడ్డ మాజీ ఉపముఖ్యమంత్రి
-
Sports News
Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
-
Movies News
Liger: షారుఖ్ సూపర్‌హిట్‌ని గుర్తు చేసిన ‘లైగర్’ జోడీ..!
-
General News
Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Politics News
Congress: మూడు దశాబ్దాలు కాంగ్రెస్‌కు హోంగార్డును.. ట్విటర్ ప్రొఫైల్‌ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి