
Punjab vs Hyderabad: కొసమెరుపు పంజాబ్‌దే
మెరిసిన హర్‌ప్రీత్, లివింగ్‌స్టోన్
నామమాత్రపు మ్యాచ్‌లో హైదరాబాద్‌పై విజయం
ముంబయి
పది జట్లతో సుదీర్ఘంగా సాగిన ఈ సీజన్ లీగ్ దశ ముగిసింది. ప్లేఆఫ్స్ బెర్తులు శనివారమే ఖరారైపోయిన నేపథ్యంలో నామమాత్రంగా మారిన చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ పైచేయి సాధించింది. సోమవారం లీగ్‌కు బ్రేక్. మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్, రాజస్థాన్ తలపడతాయి.
ఈ సీజన్లో ఓ అంకం ముగిసింది. లీగ్ దశ సమాప్తం. నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించిన పంజాబ్ ఆరో స్థానంతో టోర్నీని ముగించింది. ఆ జట్టుకిది ఏడో విజయం. ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన హైదరాబాద్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. బంతితో హర్‌ప్రీత్ బ్రార్ (3/26), బ్యాటుతో లివింగ్‌స్టోన్ (49 నాటౌట్; 22 బంతుల్లో 2×4, 5×6) సత్తా చాటడంతో ఆదివారం పంజాబ్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. మొదట హైదరాబాద్ 8 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. అభిషేక్ శర్మ (43; 32 బంతుల్లో 5×4, 2×6) టాప్ స్కోరర్. హర్‌ప్రీత్ బ్రార్ (3/26) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్‌కు కళ్లెం వేశాడు. లివింగ్‌స్టోన్‌తో పాటు శిఖర్ ధావన్ (39; 32 బంతుల్లో 2×4, 2×6) రాణించడంతో లక్ష్యాన్ని పంజాబ్ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విలియమ్సన్ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు భువనేశ్వర్ నాయకత్వం వహించాడు.
లివింగ్‌స్టోన్ ధనాధన్: ఛేదనలో పంజాబ్.. పవర్‌ప్లే ముగిసే సరికి ఓపెనర్ బెయిర్‌స్టో (23)ను కోల్పోయి 62/1తో బలంగా నిలిచింది. ఆ తర్వాత షారుఖ్ (19), మయాంక్ (1) వెంటవెంటనే ఔట్ కావడంతో 71/3తో నిలిచినా.. ఓపెనర్ ధావన్‌కు లివింగ్‌స్టోన్ తోడవడంతో పంజాబ్ లక్ష్యం దిశగా సాగింది. ధాటిగా ఆడిన లివింగ్‌స్టోన్.. ధావన్‌తో నాలుగో వికెట్‌కు 41, జితేశ్ శర్మ (19)తో అయిదో వికెట్‌కు 21, ప్రేరక్ మన్కడ్ (4 నాటౌట్)తో అభేద్యమైన ఆరో వికెట్‌కు 27 పరుగులు జోడించి తన జట్టును విజయపథంలో నడిపించాడు. షెపర్డ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో లివింగ్‌స్టోన్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు దంచాడు.
హైదరాబాద్ కట్టడి: అంతకుముందు పంజాబ్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో హైదరాబాద్‌కు కళ్లెం వేశారు. భారత టీ20 జట్టుకు ఎంపికైన అర్ష్‌దీప్ మరోసారి పొదుపుగా బౌలింగ్ చేశాడు. కానీ ప్రత్యర్థికి కళ్లెం వేయడంలో కీలక పాత్ర మాత్రం హర్‌ప్రీత్ బ్రార్దే. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకోగా.. మూడో ఓవర్లో ప్రియమ్ గార్గ్ (4)ను ఔట్ చేయడం ద్వారా ఆ జట్టును రబాడ దెబ్బతీశాడు. అయితే చక్కగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ.. రాహుల్ త్రిపాఠి (20; 18 బంతుల్లో 1×4, 1×6) ఇన్నింగ్స్‌ను నడిపించారు. 8.2 ఓవర్లలో హైదరాబాద్ 61/1తో నిలిచింది. కానీ బ్రార్ విజృంభించడంతో చకచకా నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. పరుగుల వేగం మందగించింది. 9వ ఓవర్లో త్రిపాఠిని వెనక్కి పంపిన బ్రార్.. తన తర్వాతి ఓవర్లో అభిషేక్‌నూ ఔట్ చేశాడు. పూరన్ (5)ను ఎలిస్ ఎక్కువసేపు క్రీజులో ఉండనివ్వలేదు. 15వ ఓవర్లో మార్క్రమ్ (21)ను బ్రార్ ఔట్ చేయడంతో హైదరాబాద్ 96/5తో నిలిచింది. కనీసం పోటీ ఇవ్వదగ్గ స్కోరైనా చేస్తుందా అనిపించింది. కానీ వాషింగ్టన్ సుందర్ (25; 19 బంతుల్లో 3×4, 1×6), రొమారియో షెపర్డ్ (26 నాటౌట్; 15 బంతుల్లో 2×4, 2×6) బ్యాట్ ఝుళిపించడంతో ఆ జట్టు కోలుకుంది. ఈ జంట ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించింది. చివరి అయిదు ఓవర్లలో హైదరాబాద్‌కు 61 పరుగులొచ్చాయి. సుందర్‌తో పాటు సుచిత్ (0), భువనేశ్వర్ (1) చివరి ఓవర్లో ఔటయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: భాజపాకు రూ.20 లక్షలు.. తెరాసకు రూ.3 లక్షలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?
- Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?