
Punjab vs Rajasthan: వరుసగా రెండు ఓటముల తర్వాత రాజస్థాన్ విజయం
ముంబయి: వరుసగా రెండు ఓటముల తర్వాత రాజస్థాన్ విజయం సాధించింది. అదీనూ పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో రాజస్థాన్ (14) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (68) అర్ధశతకం.. జోస్ బట్లర్ (30), సంజూ శాంసన్ (23), దేవదుత్ పడిక్కల్ (31), హెట్‌మయేర్ (31*) రాణించడంతో రాజస్థాన్ అలవోకగా విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ 2.. రబాడ, రిషి ధావన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు ముంబయి, కోల్‌కతా జట్లపై రాజస్థాన్ ఓడిపోయింది.
యశస్వి ఔట్..
రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (68) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద లియామ్ లివింగ్‌స్టోన్ చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్ మూడో వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజ్‌లో దేవదుత్ పడిక్కల్ (16*), హెట్‌మయేర్ (1*) ఉన్నారు. రాజస్థాన్ విజయానికి ఇంకా 30 బంతుల్లో 47 పరుగులు కావాలి.
రెండు వికెట్లు పడినా...
విజయం కోసం రాజస్థాన్, పంజాబ్ జట్లు పోరాడుతున్నాయి. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. జోస్ బట్లర్ (23) కాస్త త్వరగానే ఔటైనా ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (23)కూడా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రిషిధావన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన సంజూ బౌండరీలైన్ వద్ద శిఖర్ చేతికి చిక్కాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ (33*) వేగంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. రాజస్థాన్ విజయానికి ఇంకా 66 బంతుల్లో 101 పరుగులు కావాలి.
దూకుడుగా ప్రారంభం..
పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్య ఛేదనను రాజస్థాన్ దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు జైశ్వాల్ (16*), జోస్ బట్లర్ (9*) పంజాబ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. సందీప్ శర్మ తన తొలి ఓవర్‌లో 14 పరుగులు సమర్పించుకున్నా.. రెండో ఓవర్‌లో మాత్రం ఆరే ఇచ్చి కాస్త నియంత్రించాడు. మరోవైపు రబాడ కూడా 10 పరుగులు ఇచ్చుకున్నాడు.
పంజాబ్ 189/5
జానీ బెయిర్ స్టో (56) అర్ధశతకంతోపాటు జితేశ్ శర్మ (38*), భానుక రాజపక్స (27), లియామ్ లివింగ్ స్టోన్ (23) ధాటిగా ఆడటంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. దీంతో రాజస్థాన్‌కు 190 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ నెగ్గిన బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 12, మయాంక్ అగర్వాల్ 15, రిషి ధావన్ 5* పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3.. రవిచంద్రన్ అశ్విన్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. ఆఖరి పది ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు 101 పరుగులు సాధించడం విశేషం.
పుంజుకున్న రాజస్థాన్ బౌలర్లు
రాజస్థాన్ బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్ పరుగులు చేసేందుకు శ్రమిస్తోంది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (56) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఒకే ఓవర్‌లో చాహల్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (15)తోపాటు బెయిర్‌స్టోను ఔట్ చేసి పంజాబ్‌ను దెబ్బ కొట్టాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజ్‌లో జితేశ్ శర్మ (1*), లియామ్ లివింగ్‌స్టోన్ (1*) ఉన్నారు. అంతకుముందు భానుక రాజపక్స (27)ను చాహల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 21 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ధాటిగా ఆడుతూ..
పంజాబ్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. చాహల్ వేసిన ఏడో ఓవర్‌లో భానుక రాజపక్స ఓ సిక్సర్ బాదాడు. అశ్విన్ వేసిన తర్వాతి ఓవర్‌లో బెయిర్ స్టో ఓ ఫోర్ బాదాడు. దీంతో పాటు నాలుగు సింగిల్స్ వచ్చాయి. కుల్‌దీప్ సేన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రాజపక్స మరో సిక్స్ బాదగా.. బెయిర్ స్టో ఫోర్ బాదాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 10వ ఓవర్‌లో రాజపక్స వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 10 ఓవర్లకు పంజాబ్ 88/1 స్కోరుతో ఉంది. బెయిర్ స్టో (44), రాజపక్స (27) క్రీజులో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టో.. ధావన్ ఔట్
పంజాబ్ ఓపెనర్ బెయిర్ స్టో దూకుడుగా ఆడుతున్నాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో ఒక్క పరుగు రాలేదు. కుల్‌దీప్ సేన్ వేసిన నాలుగో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన బెయిర్ స్టో.. బౌల్ట్ వేసిన ఐదో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. అశ్విన్ వేసిన ఆరో ఓవర్‌లో ధావన్ (12) ఔటయ్యాడు. అతడు వికెట్‌కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లకు పంజాబ్ 48/1 స్కోరుతో ఉంది. బెయిర్ స్టో (31), భానుక రాజపక్స (1) క్రీజులో ఉన్నారు.
ప్రారంభమైన మ్యాచ్.. నిలకడగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్లు
పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్‌ని ఎంచుకుంది. బెయిర్ స్టో, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో బెయిర్ స్టో రెండు ఫోర్లు బాదగా.. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన తర్వాతి ఓవర్‌లో ధావన్ ఓ ఫోర్ బాదాడు. 2 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. బెయిర్ స్టో (11 ), ధావన్ (5) క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
వాంఖడే వేదికగా పంజాబ్, రాజస్థాన్ జట్లు మరికాసేపట్లో కీలక పోరులో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తోంది. మరోవైపు ఆరు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ ఇందులో గెలుపొంది ప్లేఆఫ్స్ బెర్తుకు మరింత చేరువ కావాలని ఆశిస్తోంది.
రాజస్థాన్ : జాస్ బట్లర్, జైస్వాల్, సంజూ శాంసన్, పడిక్కల్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్డ్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్, కుల్దీప్ సేన్
పంజాబ్ : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, రాజపక్స, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mohammed Zubair: ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్ట్
-
Business News
Credit cards: క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తున్నారు.. ఈ కామర్సుల్లోనే ఎక్కువ!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
COVID cases: తెలంగాణలో భారీగా కొవిడ్ కేసులు.. హైదరాబాద్‌లో ఎన్నంటే?
-
Politics News
Andhra News: సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని ఆవేదన
-
Politics News
Loan apps: వద్దన్నా లోన్లు.. ‘నగ్న ఫొటో’లతో వేధింపులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్