Published : 04 Aug 2022 18:07 IST

CWG 2022: బ్యాడ్మింటన్‌లో ప్రి క్వార్టర్స్‌కు చేరిన సింధు, శ్రీకాంత్‌

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రి క్వార్టర్స్‌కు చేరింది. గురువారం జరిగిన 32వ రౌండ్‌లో మాల్దీవ్స్‌ షట్లర్‌ ఫాతిమా నబా అబ్దుల్‌ రజాక్‌ను 21-4, 21-11 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ పోటీలో సింధు వరుసగా రెండు సెట్లు గెలిచి కేవలం 21 నిమిషాల్లోనే సునాయాసంగా విజయం సాధించింది. తొలి గేమ్‌లో ఫాతిమా తేలిపోగా రెండో గేమ్‌ తొలి భాగంలో కాస్త గట్టి పోటీనిచ్చింది. దీంతో ఒకానొక సమయంలో సింధుతో 9-9 స్కోర్‌తో సమానంగా నిలిచింది. అయితే తర్వాత పుంజుకున్న సింధు రెండో గేమ్‌లో విరామ సమయానికి 11-9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక తర్వాత మరింత చెలరేగిన భారత షట్లర్‌ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-11తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ పోటీలో కిదాంబి శ్రీకాంత్‌.. ఉగాండాకు చెందిన డేనియల్‌ వానాగలియాను 21-9, 21-9 తేడాతో ఓడించి ప్రిక్వార్స్‌కు చేరాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని