PV Sindhu: ప్రపంచటూర్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి పాలైంది.
బాలి: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి పాలైంది. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో దక్షిణకొరియాకు చెందిన సియాంగ్ చేతిలో సింధుకు పరాజయం ఎదురైంది. 16-21, 12-21 తేడాతో సియాంగ్ చేతిలో సింధు ఓడిపోయింది. డిఫెన్సివ్‌గా ఆటను ప్రారంభించిన సింధు దక్షిణ కొరియా క్రీడాకారిణికి చాలా అవకాశాలను ఇచ్చింది. దీంతో సియాంగ్ దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంది. తొలి సెట్‌లో కాస్త ప్రతిఘటించిన సింధు రెండో సెట్‌లో మాత్రం సియాంగ్ దెబ్బకు చేతులెత్తేసింది. దీంతో టైటిల్‌ను గెలిచే అవకాశాన్ని కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్