PV Sindhu: ‘స్విస్‌ ఓపెన్’ విజేతగా పీవీ సింధు.. ఫైనల్‌లో థాయ్ షట్లర్‌పై ఘన విజయం

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో...

Updated : 10 Aug 2022 10:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగించింది. ఫైనల్‌లో విజయం సాధించి స్విస్ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో 21-16, 21-8 తేడాతో వరుస సెట్లలో థాయ్‌లాండ్‌ షట్లర్ బుసానన్‌పై పీవీ సింధు విజయం సాధించింది. కేవలం 49 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. నిన్న (శనివారం) జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో రెండో సీడ్‌ సింధు 21-18, 15-21, 21-19 తేడాతో అన్‌సీడెడ్‌ సుపానిదా (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు పురుషుల విభాగంలో టీమ్ఇండియా ఆటగాడు ప్రణయ్‌ మరికాసేపట్లో ఇండోనేషియాకు చెందిన జొనాథన్‌ క్రిస్టీతో తలపడనున్నాడు. 2017లో యుఎస్‌ ఓపెన్‌ ప్రణయ్‌.. స్విస్‌ సెమీస్‌లో 21-19, 19-21, 21-18తో ప్రపంచ అయిదో ర్యాంకర్‌ ఆంథోని (ఇండోనేషియా)కి షాకిచ్చిన విషయం తెలిసిందే. కిదాంబి శ్రీకాంత్‌ను ఓడించి మరీ జొనాథన్‌ ఫైనల్‌కు దూసుకొచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని