
PV Sindu: సెమీస్‌లో సింధు
సాత్విక్ జోడీ ముందంజ
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో మూడో సీడ్ సింధు 14-21, 21-19, 21-14తో సిమ్ యుజిన్ (కొరియా)పై గెలుపొందింది. 66 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థిపై సింధు పైచేయి సాధించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోడీ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సాత్విక్- చిరాగ్ 21-19, 21-19తో జో ఫెయ్- నూర్ ఐజుద్దీన్ (మలేసియా)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 12-21, 8-21తో రెండో సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో రెండో సీడ్ ఇంతానన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు, టాప్ సీడ్ మార్కస్ గిడియోన్- కెవిన్ సుకములో (ఇండోనేసియా)తో సాత్విక్- చిరాగ్ తలపడతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.