PV Sindhu: శెభాష్‌ సింధు.. కేంద్రమంత్రుల సన్మానం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధును కేంద్ర మంత్రులు జి కిషన్‌ రెడ్డి, నిర్మలా సీతారామన్‌, అనురాగ్ ఠాకూర్‌లు మంగళవారం ఘనంగా సన్మానించారు.

Updated : 03 Aug 2021 20:32 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధును పలువురు కేంద్రమంత్రులు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో  కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, నిర్మలా సీతారామన్‌, అనురాగ్ ఠాకూర్‌, నిశిత్‌ ప్రమాణిక్‌ పాల్గొని సింధు క్రీడా ప్రతిభను కొనియాడారు. కఠోర శ్రమకు ప్రతిఫలంగా సింధు వరుసగా రెండోసారి ఒలింపిక్‌ పతకం సాధించడం గర్వకారణమని కిషన్‌రెడ్డి ప్రశంసించారు. నిరంతర సాధన, పట్టుదల, కుటుంబ సహకారం, కోచ్‌, సహాయకుల మద్దతుతో సింధు ఈ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభినందించారు. యువతకు సింధు ఆదర్శమని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రశంసించారు. భారత్ నుంచి మెరిసిన గొప్ప ఒలింపియన్లలో సింధు కూడా ఒకరని ఆయన కొనియాడారు. 135 కోట్ల మంది భారతీయుల ముఖాల్లో ఆమె విజయం చిరునవ్వులు విరబూయించిందన్నారు. సింధు విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌ పార్క్‌ తెసాంగ్‌ను కూడా మంత్రులు ఘనంగా సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని