IPL 2023: లఖ్‌నవూకు బలం ఆ ఇద్దరే.. కానీ ఫ్లే ఆఫ్స్‌కు మాత్రం వెళ్లదు: ఆరోన్‌ ఫించ్‌

ఐపీఎల్‌ - 2023 (IPL 2023)లో స్టార్‌ బ్యాటర్లు క్వింటన్ డికాక్‌ (Quinton de Kock), కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు ప్రధాన బలమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌  (Aron Finch) అన్నాడు. కానీ ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం కష్టమేనని అంచనా జోస్యం చెప్పాడు.

Updated : 28 Mar 2023 16:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ - 2023 (IPL 2023)లో స్టార్‌ బ్యాటర్లు క్వింటన్ డికాక్‌ (Quinton de Kock), కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు ప్రధాన బలమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌  (Aron Finch) అన్నాడు. కానీ, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం కష్టమేనని అంచనా వేశాడు. దానికి కారణం ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటమే కారణంగా పేర్కొన్నాడు.

‘‘కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డికాక్‌ ప్రత్యేకమైన ఆటగాళ్లు. వారి బలాలు, బలహీనతలు ఒకదానినొకటి భర్తీ చేస్తాయి. కాబట్టి వారు ఈ సీజన్లో రాణిస్తారని భావిస్తున్నాను. అయితే, ఆ జట్టు ఫ్లే ఆఫ్స్‌కు వెళ్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ జట్టు డెత్‌ బౌలింగ్‌లో బలహీనంగా ఉంది. మిడిలార్డర్‌లో వారికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. వారికి మంచి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. కానీ, జట్టు కూర్పును గమనిస్తే చివరి నాలుగు డెత్‌  ఓవర్లలో నాణ్యమైన బౌలింగ్‌ చేయడం వారికి సవాలే. మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, దీపక్ హుడా వంటి బ్యాటర్లతో జట్టు బలంగా ఉంది. వారు రాణించి గొప్ప స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచితే జట్టుకు లాభం చేకూరే అవకాశం ఉంది’’ అని తెలిపాడు.

‘‘లఖ్‌నవూలో అందరూ ఆత్రుతగా ఎదురుచూసేది నికోలస్‌ పూరన్‌ కోసమే. ఎందుకంటే వేలంలో చాలా ఎక్కువ మొత్తం చెల్లించి అతడిని లఖ్‌నవూ సొంతం చేసుకుంది. గత సీజన్‌లో అతడు  రాణించలేదు. కానీ, అతడు ఎంత విధ్వంసకరమైన ఆటగాడో మనకు తెలుసు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే అతడు ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో గొప్పగా రాణించగలడు.  మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే దీపక్‌ హుడా ఈ సీజన్‌లో ఆడతాడని అనుకుంటున్నా.  అతడు తన దూకుడు స్వభావాన్ని కొనసాగిస్తాడని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.  ఇక లఖ్‌నవూ ఏప్రిల్ 1న దిల్లీ కాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని