ASHWIN: ఇంతకీ అశ్విన్ బౌలింగ్ శైలి ఏంటి..? వైరల్‌గా మారిన ‘ఎడిటెడ్ బయో’
భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లతోపాటు అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాప్ స్పిన్నర్ అశ్విన్ (Ashwin) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఎందుకో తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా (team india) టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (ravichandran ashwin) బౌలింగ్ శైలి ఏంటో అందరికీ తెలుసు. విభిన్నంగా బంతులను సంధించి ప్రత్యర్థులతో ఆటాడుకొనే అశ్విన్.. మాటల్లోనూ తనదైన దూకుడు ప్రదర్శిస్తాడు. కానీ, వికీపిడియాలో అశ్విన్‌కు చిన్న ఝలక్ తగిలింది. తన బయోడేటాను ఎవరో పొరపాటుగా ఎడిట్ చేసిన ఇమేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అశ్విన్ నెట్టింట్లో వైరల్‌గా మారాడు. ఇంతకీ ఆ ఇమేజ్‌లో ఏముందంటే..?
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ఏంటనేది భారత క్రికెట్ అభిమానులతో ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కానీ, ఓ అజ్ఞాత వ్యక్తి మాత్రం అశ్విన్ బౌలింగ్ స్టైల్‌ను చాలా విచిత్రంగా పెట్టాడు. ‘కుడి చేతి ఆఫ్ బ్రేక్..?’’ ‘‘కుడి చేతి లెగ్ బ్రేక్..?’’ వీటిల్లో ఏదో తెలియక రెండింటినీ పెట్టేశాడు. దీనికి అశ్విన్ ‘‘నేను మార్నింగ్ కాఫీతో దీనిని చూశా. ఎవరు చేశారో కానీ.. ఆశ్చర్యపోయా’’ అని నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అభిమానులు తమ కామెంట్లతో చెలరేగిపోయారు. రాజస్థాన్ రాయల్స్ అయితే ‘‘బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) తొలి రోజు ఆటకు స్వాగతం’’ అంటూ ఫన్నీ ట్వీట్ చేసింది. భారత్ - ఆసీస్ టెస్టు సిరీస్ (ind vs aus) నేపథ్యంలో ఇలా పెట్టడంతో ఆకట్టుకొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Vijayawada: విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48కోట్ల విలువైన బంగారం పట్టివేత
-
Education News
RRC Secunderabad: దక్షిణ మధ్య రైల్వే.. గ్రూప్-డి తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Accident: బాణసంచా గోదాంలో ప్రమాదం.. ఏడుగురి మృతి
-
Politics News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ.. మరో ఆందోళనకు సిద్ధమైన భాజపా
-
Movies News
Social Look: ఉగాది పండగ.. తారలు సంప్రదాయ లుక్‌లో కనిపించగా!