R Praggnanandhaa: మరోసారి కార్ల్‌సన్‌ను ఓడించి షాకిచ్చిన ప్రజ్ఞానంద

భారత గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు మూడు నెలల వ్యవధిలో రెండోసారి షాకించ్చాడు..

Updated : 21 May 2022 13:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు మూడు నెలల వ్యవధిలో రెండోసారి షాకిచ్చాడు. ప్రస్తుతం జరుగుతోన్న ‘చెస్సబుల్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌’లో పాల్గొన్న వీరిద్దరూ శుక్రవారం ఐదో రౌండ్‌లో తలపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ హోరాహోరీగా ఆడడంతో చివరికి మ్యాచ్‌ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే, చివరి క్షణాల్లో కార్ల్‌సన్‌ 40వ మూవ్‌లో తప్పు చేయడంతో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. దీంతో మొత్తం 12 పాయింట్లు సాధించిన ఈ భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ ఈ టోర్నీలో నాకౌట్‌ దశకు చేరేందుకు మరింత దగ్గరయ్యాడు. శుక్రవారం సాయంత్రానికి అతడు ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. కార్ల్‌సన్‌ 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన ‘ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ టోర్నమెంట్‌’లోనూ ప్రజ్ఞానంద.. ప్రపంచ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని