టీమిండియా ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు!
సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్×ఆసీస్ మూడో టెస్టులో కొందరు ఆస్ట్రేలియా అభిమానులు అతిగా ప్రవర్తించారు. టీమిండియా ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌పై జాత్యంహకార...
ఇంటర్నెట్‌డెస్క్: సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్×ఆసీస్ మూడో టెస్టులో కొందరు ఆస్ట్రేలియా అభిమానులు అతిగా ప్రవర్తించారు. రెండు, మూడో రోజు ఆట సమయంలో టీమిండియా ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌పై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. బౌండరీ లైన్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లపై దురహంకార వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు దృష్టి తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లీతో మాట్లాడింది. సీఏ అధికారులు సిరాజ్‌తో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకున్నారు.
శనివారం ఆట ముగిసిన తర్వాత టీమిండియా సారథి అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ విషయంపై అంపైర్లు పాల్ రీఫెల్, విల్సన్‌కు తెలియజేశారు. అనంతరం అంపైర్లు భద్రతా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మైదానంలో ఉన్న ఐసీసీ సెక్యూరిటీ అధికారి కూడా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి పరిస్థితులు తెలుసుకున్నాడు. దీనిపై ఐసీసీ పూర్తి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సంఘటనపై టీమిండియా యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది.
అయితే మద్యం సేవించిన ఓ ఆసీస్ అభిమాని.. సిరాజ్‌ను ‘కోతి’ అని పిలిచాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 2007 సిడ్నీ టెస్టులో జరిగిన ‘మంకీగేట్’ ఉదంతాన్ని గుర్తుచేయాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశాడని వెల్లడించాయి. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో మంకీగేట్ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. హర్భజన్ సింగ్ తనని కోతి అని పిలిచాడని ఆసీస్ ఆల్‌రౌండర్ సైమండ్స్ ఫిర్యాదు చేశాడు. అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని భజ్జీ వివరణ ఇచ్చాడు. కాగా, అప్పట్లో మంకీగేట్ ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్‌పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్‌కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్‌కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్‌పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్‌రైజర్స్ పొట్టి లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్‌గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్