Rafael Nadal : ఆస్ట్రేలియన్‌ఓపెన్‌ ఫైనల్‌లో రఫ్పాడించిన నాదల్‌.. మధుర క్షణాలు వీక్షించండి

 ఓ పక్క గాయాలు.. మరోవైపు పెరుగుతున్న వయస్సు.. అయితే ఇవేమీ...

Updated : 30 Jan 2022 21:19 IST

ఇంటర్నెట్ డెస్క్: ఓ పక్క గాయాలు.. మరోవైపు పెరుగుతున్న వయస్సు, కుర్రాళ్లతో పోటీ.. అయితే ఇవేమీ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును సాధిద్దామనే కలను ఆపలేకపోయాయి. పాతికేళ్ల యువకుడు మెద్వెదెవ్‌ మీద 35 ఏళ్ల రఫెల్‌ నాదల్ ఐదు సెట్ల పోరులో దాదాపు 5 గంటల 24 నిమిషాలపాటు పోరాడి మరీ 2-6, 6-7, 6-4, 6-4,7-5 తేడాతో విజయం సాధించడం సంచలనమే అని చెప్పాలి. జకోవిచ్‌, రోజర్‌ ఫెదరర్‌ లేకపోయినా మెద్వెదెవ్, సిట్సిపాస్‌, వెరెవ్‌, బెరెట్టిని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. వారందరినీ తోసిరాజని తన అనుభవంతో నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది తన రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్ టైటిల్‌ కావడం విశేషం. ఫైనల్‌లో నాదల్ విజయం సాధించిన మధుర క్షణాలను మీరూ చూసేయండి.. 







Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని