Nadal - Federer: రోజర్‌ వీడ్కోలు.. నా జీవితంలో కొంత భాగం అతడితోనే ఉండిపోయింది: నాదల్

టెన్నిస్‌ స్టార్‌ ఆటగాళ్లు అంటే ఠక్కున గుర్తుకొచ్చే వారిలో రోజర్ ఫెదరర్‌, రఫేల్‌ నాదల్‌ ప్రముఖులు. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన వీరిద్దరిలో రోజర్ ఫెదరర్‌ ఇటీవల ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Published : 27 Nov 2022 14:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రోజర్ ఫెదరర్‌, రఫేల్‌ నాదల్‌ ప్రస్తుత తరంలో టెన్నిస్‌ దిగ్గజాలు. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన వీరిద్దరిలో రోజర్ ఫెదరర్‌ ఇటీవల ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో లావెర్ కప్‌ వేదికగా చివరి మ్యాచ్‌ను ఆడేశాడు. ఈ సందర్భంగా రఫేల్ నాదల్, ఫెదరర్‌ భావోద్వేగానికి గురై కంటతడిపెట్టిన ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. తాజాగా అర్జెంటీనాలో ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ సందర్భంగా రఫేల్‌ నాదల్ తన స్నేహితుడిని గుర్తు చేసుకొన్నాడు. 

‘‘నేను ప్రశంసలు కురిపించిన.. నాకు ప్రతి టోర్నీలో పోటీగా ఉన్నటువంటి ఆటగాడు, టెన్నిస్‌ కోర్టు వెలుపలా చాలా విషయాలను పంచుకొన్న దిగ్గజం ఆడకపోవడం బాధగా ఉంది. ఎందుకంటే ‘నా జీవితంలో కొంత భాగం’ అతడితోనే ఉండిపోయింది. కీలకమైన వ్యక్తి వీడ్కోలు తీసుకొన్నాడని చెప్పడం కూడా మనసుకు కష్టంగానే ఉంటుంది. నా జీవితంలోని చాలా విషయాలు టెన్నిస్‌ కంటే కూడా ఎక్కువే’’ అని నాదల్‌ వెల్లడించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు