Rafael Nadal : ‘క్లే కోర్టు’ కింగ్... పోరాటాల స్పెయిన్ బుల్.. రఫెల్ నాదల్
కేవలం పదిహేనేళ్లకే ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి ప్రవేశించిన ఓ కుర్రాడు.. మరో...
కెరీర్లో రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్
మొత్తం 21కి చేరిన గ్రాండ్‌స్లామ్‌లు
కేవలం పదిహేనేళ్లకే ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి ప్రవేశించిన ఓ కుర్రాడు.. మరో నాలుగు సంవత్సరాలకు తొలి టైటిల్ నెగ్గడం.. ఇవాళ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల విజేతగా ఆవిర్భవిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ‘క్లే కోర్టు’ రారాజుగా వెలుగొందుతున్న వీరుడు.. ఇంతకీ ఆ ఘనతలను సాధించిందెవరో తెలుసా.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.
1986 జూన్ 3న స్పెయిన్‌లో జన్మించిన రఫెల్ నాదల్.. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశించాడు. మరో నాలుగు సంవత్సరాలకే తొలి టైటిల్ (2005-ఫ్రెంచ్ ఓపెన్)ను తన ఖాతాలో ఒక్కసారిగా క్రీడాలోకాన్ని తనవైపు చూసేట్లు చేశాడు. అప్పటికే దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ క్లే కోర్టులు మినహా మిగతా అన్ని మైదానాల్లో మాంచి ఊపులో ఉన్నాడు. దీంతో రఫెల్ మట్టి కోర్టుల్లో చెలరేగిపోయాడు. ఒక వైపు రోజర్ ఉండగానే.. మరోవైపు జకోవిచ్ దూసుకొచ్చాడు. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్, వింబుల్డన్ ఏదైనా సరే వీరి ముగ్గురిలో ఒకరికి దక్కడం ఖాయంగా ఉండేది. త్రిముఖ పోరులో నాదల్
2008లో నంబర్‌వన్ ర్యాంకుకు చేరాడు. దాదాపు 209 వారాలపాటు టాప్‌లో కొనసాగాడు. ఆ తర్వాత జకోవిచ్ (2011) ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత నాదల్ మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడాడు. చివరిసారిగా 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు.
21 ఏళ్లు.. 21 గ్రాండ్‌స్లామ్‌లు
నాదల్ కెరీర్ ప్రారంభించి దాదాపు 21 ఏళ్లు కావడం.. ఇప్పుడు గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య కూడా 21కి చేరడం విశేషం. వ్యక్తిగత విభాగంలో టెన్నిస్ ఆడటం ఎప్పుడూ సవాలే. ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం, గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి గాయమైతే కోలుకునేందుకు నెలలపాటు సమయం పడుతుంది. ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డెన్ టైటిళ్లను గెలుచుకున్న నాదల్.. అత్యధికంగా ఫ్రెంచ్ ఓపెన్‌ను 13 సార్లు సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక యూఎస్ ఓపెన్‌ను నాలుగు సార్లు తన ఖాతాలో
వేసుకున్నాడు. ఒకే ఏడాదిలో (2010) ఆస్ట్రేలియన్ ఓపెన్ మినహా మూడు టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. నాదల్ తర్వాత జకోవిచ్ (20), ఫెదరర్ (20) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈసారి ఎంతో ప్రత్యేకం..
ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ ముందు వరకు రోజర్ ఫెదరర్, జకోవిచ్‌తో పాటు నాదల్ 20 గ్రాండ్‌స్లామ్‌లతో సమంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకోలేకపోవడం, వయసుమీరడం వంటి కారణాలతో ఫెదరర్ పాల్గొనలేదు. ఇక జకోవిచ్ సంగతి తెలిసిందే.. వ్యాక్సినేషన్ వ్యవహారంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేకపోయాడు. ఇక సీనియర్ రఫెల్ నాదల్ మాత్రమే. అయితే యువ క్రీడాకారులు సిట్సిపాస్, మెద్వెదెవ్ వంటి వారితో ఇరకాటం తప్పలేదు. మరోవైపు గత గాయాలు నాదల్ వెంబడిస్తున్నా పట్టుదలతో బరిలోకి దిగాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ వరకు పెద్దగా ఇబ్బంది పడని నాదల్.. అక్కడ మాత్రం సిట్సిపాస్‌తో పోరాడి విజయం సాధించాడు. ఫైనల్లోనూ తొలి రెండు సెట్లు ఓడిపోయిన నాదల్.. తిరిగి గొప్పగా పుంజుకున్నాడు. అసాధారణ రీతిలో పోరాటపటిమ చూపి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు.
కెరీర్లో నాదల్ ఇప్పటి వరకు గెలిచిన గ్రాండ్‌స్లామ్‌లు..
* ఆస్ట్రేలియన్ ఓపెన్ (2): 2009, 2022
* ఫ్రెంచ్ ఓపెన్ (13): 2005, 2006, 2007, 20008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020
* వింబుల్డెన్ (2) : 2008, 2010
* యూఎస్ ఓపెన్ (4): 2010, 2013, 2017, 2019
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్‌రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్‌కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్‌కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్‌ను తప్పించాల్సిందే
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్‌ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ