Published : 07 Jun 2021 16:11 IST

Rafel Nadal: నాకు పెళ్లైంది.. రఫా తికమక!

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ అభిమానులను అయోమయానికి గురిచేశాడు. ‘నాకు పెళ్లైంది’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో అంతా తికమక పడ్డారు. గతంలోనే పెళ్లైంది కదా? ఫ్రెంచ్‌ ఓపెన్‌ మధ్యలో ఎలా పెళ్లి చేసుకున్నావ్‌?అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. మరికొందరేమో ‘మీ ఇద్దరికీ వివాహ శుభాకాంక్షలు!’ అని తెలియజేశారు.

ప్రస్తుతం రఫెల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడుతున్నాడు. తనను ఎప్పట్నుంచో ఊరిస్తున్న 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కొట్టాలని తహతహలాడుతున్నాడు. నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. వాస్తవంగా 2019, అక్టోబర్‌లోనే ఫ్రానిస్కా పరెల్లొను నాదల్‌ పెళ్లాడాడు. ఆమెతోనే జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతడి ఫేస్‌బుక్‌ పేజీ ‘About’లో 2019 నుంచి వివాహితుడినే అని ఉండటం గమనార్హం. అయితే ఆదివారం అర్ధరాత్రి అతడు ‘నాకు పెళ్లైంది’ అని పోస్ట్‌ చేయడంతో గందరగోళం మొదలైంది.

‘రఫాకు, అతడి భార్యకు అభినందనలు!! మీ ఇద్దరికీ ఎప్పుడో పెళ్లైందనే అనుకున్నా! చూస్తుంటే కాలేదని అనిపిస్తోంది’ అని ఒక అభిమాని ట్వీటారు. ‘ఈ బాంబుతో ఎంతమంది హృదయాలు ముక్కలయ్యాయో!! కానీ 2019లోనే కదా ఇలా జరిగింది?’ అని మరొకరు అన్నారు. ‘అభినందనలు. కానీ తికమక పడ్డాను. అతడికి 2019 అక్టోబర్‌లోనే పెళ్లైందని వికీపేజీలో ఉంది’ అని ఇంకొకరు చెప్పారు. ‘కంగ్రాట్స్‌! కానీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ మధ్యలో ఎలా పెళ్లి చేసుకున్నావో ఊహకు తట్టడం లేదు’ అని ఒకరు ట్వీటారు. ‘ఇది సరికాదు. అతడికి 2019లోనే పెళ్లైంది’ అని ఓ అభిమాని అన్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని