Updated : 08/11/2021 16:25 IST

T20 World Cup: వరుణ్‌ స్థానంలో జట్టులోకి రాహుల్ చాహర్!‌: ఆకాశ్‌ చోప్రా

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. టీమిండియా సెమీ ఫైనల్ చేరకుండానే ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఇక సోమవారం నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో కోహ్లీ సేన.. నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడైన రాహుల్ చాహర్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌ తుది జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో.. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క రాహుల్ చాహర్‌ తప్ప మిగతా వారంతా కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా ఆడారు. దీంతో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో రాహుల్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ‘సోమవారం నమీబియాతో జరుగనున్న మ్యాచ్‌ కోసం భారత్‌ తుది జట్టులో మార్పులు చేస్తే కచ్చితంగా రాహుల్‌ చాహర్‌కు అవకాశమిస్తారు. అయితే, ఎవరిని పక్కన పెట్టాలనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఆల్-రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టులో కీలకంగా ఉన్నాడు. ఇటు బంతితోనూ, అటు బ్యాటుతోనూ నిలకడగా రాణిస్తున్నాడు. మరో వైపు, చాలా కాలం తర్వాత పొట్టి ఫార్మాట్లో స్థానం దక్కించుకున్న సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. కాబట్టి, వీరిద్దరిని పక్కన పెట్టే అవకాశం లేదు. ఇక, జట్టులోకి కొత్తగా వచ్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కాబట్టి, అతడి స్థానంలో రాహుల్‌ చాహల్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

దాంతో పాటు, ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లను అలాగే కొనసాగిస్తూ..  హార్దిక్ పాండ్య స్థానంలో యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌కి మరో అవకాశం ఇవ్వొచ్చని ఆకాశ్‌ అభిప్రాయపడ్డాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని