Rahul - BCCI: చురచుర చూపులే కాదు.. బంతిని గిరిగిరా తిప్పేస్తా
న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా మాంచి జోష్‌లో ఉంది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అందించిన...
నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్
ఇంటర్నెట్ డెస్క్: ‘‘అబ్బో.. ట్రైనింగ్ సెషన్స్‌లో రాహుల్ ద్రవిడ్ చాలా స్ట్రిక్ట్. అసలు ఆటగాళ్లతో చనువుగా ఉంటాడో లేదో’’ అనే అనుమానాలు చాలా వచ్చాయి. అయితే ఒకరకంగా చెప్పాలంటే శిక్షణ సమయంలో చురచుర చూపులతో ద్రవిడ్ కఠినంగా ఉంటాడనే మాట వాస్తవమే కానీ.. మరీనూ భయపెట్టేంత కాదని బీసీసీఐ షేర్ చేసిన వీడియోను చూస్తే మనకర్థమవుతుంది. తాను పక్కన ఉండి చూసే రకం మాత్రమే కాదు.. ఆటగాళ్లతో ఆడి మరీ ట్రైనింగ్ ఇస్తా అన్నట్లుగా ఉంటుంది. టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా కాసేపు బౌలర్‌గా మారి బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తూ ఎవరైనా కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్ ఉన్నారా? అని క్యాప్షన్ పెట్టింది. దీనికి భారీగా స్పందించిన క్రికెట్ అభిమానులు వేలల్లో లైకులు కొట్టారు. ఆటగాడిగా టెస్టుల్లో, వన్డేల్లో అప్పుడు బంతులను విసిరిన రాహుల్ కోచ్‌గా ప్రాక్టీస్ సెషన్స్‌లో బౌలింగ్ చేయడం విశేషం. కెరీర్ మొత్తం మీద 164 టెస్టుల్లో 20 ఓవర్లు వేసిన రాహుల్ 39 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా పడగొట్టాడు. అదే వన్డేల్లో 344 మ్యాచ్‌లకుగాను 31 ఓవర్లు వేసి 170 పరుగులు ఇచ్చాడు. నాలుగు వికెట్లు తీశాడు. రాహుల్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 2/43.
న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా మాంచి జోష్‌లో ఉంది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అందించిన తొలి టైటిల్. ఈ క్రమంలో రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, పంత్, షమీ, బుమ్రా వంటి సీనియర్లు అందుబాటులో ఉండరు. వీరి స్థానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ దక్కింది. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, కేఎస్ భరత్ వంటి కొత్త బ్యాటర్లు జట్టులోకి వచ్చారు. అయితే వీరిలో తుది జట్టులో ఉండేదెవరో రేపే తేలుద్ది. మొదటి టెస్టుకు సారథిగా అజింక్య రహానె బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ షేర్ చేసిన వీడియో మీ కోసం...
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్‌రైజర్స్ పొట్టి లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్‌గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)