IND vs NZ: మరోసారి ప్రత్యేకత చాటుకున్న రాహుల్ ద్రవిడ్‌.!

టీమ్ఇండియా కొత్త కోచ్‌ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ కోసం పిచ్‌ని ప్రత్యేకంగా తయారు చేయించాడు. టెస్టు క్రికెట్లో..

Published : 30 Nov 2021 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్ఇండియా కొత్త కోచ్‌ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ కోసం పిచ్‌ని ప్రత్యేకంగా తయారు చేయించాడు. టెస్టు క్రికెట్లో మామూలుగా ఆతిథ్యమిస్తున్న జట్టుకి అనుకూలించేలా పిచ్‌ని తయారు చేస్తుంటారు. అయితే, ద్రవిడ్‌ అందుకు భిన్నంగా ఇరుజట్లకు పిచ్‌ అనుకూలించేలా తయారు చేయించి ప్రత్యేకత చాటుకున్నాడు. ఇందుకోసం శివకుమార్‌ నేతృత్వంలోని గ్రీన్‌ పార్క్‌ మైదాన సిబ్బందికి రూ. 35 వేలు అందించడం గమనార్హం. మ్యాచ్‌ ముగిసిన అనంతరం.. ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (యూపీసీఏ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఐదో రోజు చివరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. అయితే, కివీస్‌ టెయిలెండర్లు అజాజ్‌ పటేల్ (2), రచిన్‌ రవీంద్ర (18) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో టీమ్‌ఇండియా విజయానికి ఒక్క వికెట్ దూరంలో నిలిచిపోయింది. 

ఇటీవలి కాలంలో ఎక్కువగా మూడు నాలుగు రోజుల్లోనే టెస్టు మ్యాచులు ముగిసిపోతున్నాయి. సొంత జట్టుకి అనుకూలంగా పిచ్‌ని తయారు చేయించి విజయం సాధించడంలో మజా లేదని భావించిన ద్రవిడ్‌.. ఇలా తటస్థంగా తయారు చేయించాడని విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పిచ్‌పై శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌, టామ్ లేథమ్‌, విల్‌ యంగ్‌ వంటి బ్యాటర్లు నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. మరోవైపు టిమ్ సౌథీ, కైల్‌ జేమీసన్‌ వంటి విదేశీ బౌలర్లు కూడా మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని