INDvsSL: లంక పర్యటనకు ద్రవిడే సరైనోడు!

శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడే సరైన వాడని పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హఖ్‌ అన్నాడు.....

Published : 22 May 2021 22:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడే సరైన వాడని పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హఖ్‌ అన్నాడు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానన్నాడు. దేశవాళీ క్రికెట్‌ను అభివృద్ధి చేస్తే ప్రతిభావంతులు బయటకు వస్తారని భారత్‌ నిరూపించిందని ప్రశంసించాడు. తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడాడు.

‘రాహుల్‌ ద్రవిడ్‌ గురించి నేను ముందే చెప్పాను. అండర్-19 క్రికెట్లో అతడు ప్రతిభావంతులను ఎలా వెలికితీశాడో వివరించాను. అతడి శిక్షణలో ఉన్నవారు ఇప్పుడు టీమ్‌ఇండియాకు క్రమం తప్పకుండా ఆడుతున్నారు. ఇప్పుడు శ్రీలంకకు వెళ్లే జట్టుకు అతడే కోచ్‌గా ఉంటాడని తెలుస్తోంది. నిజంగా ఇది అద్భుతం. చాలా ఆసక్తిగా అనిపిస్తోంది’ అని ఇంజీ తెలిపాడు.

‘అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌ మార్పుకు శ్రీకారం చుడుతోంది. దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థను మెరుగు పరిస్తే ప్రతిభావంతులు వెలుగు చూస్తారని బీసీసీఐ నిరూపించింది. దీనిని అనుసరించే ప్రతి బోర్డు ఇప్పుడు భారత్‌ చేస్తున్నట్టే చేయగలదు. రెండు జట్లను ఒకే సమయంలో ఆడించగలదు. రెండు జట్ల పద్ధతిని భారత్‌ విజయవంతం చేస్తే ఇతర జట్లకు ఇది గీటురాయి అవ్వగలదు’ అని ఇంజీ వెల్లడించాడు. భారత్‌ ఒకే సమయంలో శ్రీలంక, ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని