WTC Final 2023: అజింక్య రహానే.. ఆ బాధ్యత నీదే: రాహుల్ ద్రవిడ్
సీనియర్ ఆటగాడు అజింక్య రహానేపై టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదే క్రమంలో ఓ కీలక సూచననూ రహానేకు ద్రవిడ్ చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final 2023) సంగ్రామం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా, భారత ఆటగాళ్ల సన్నద్ధ కొనసాగుతోంది. బుధవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాడు అజింక్య రహానే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పలు కీలక సూచనలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. మ్యాచ్ సన్నద్ధత సహా ఇతర అంశాలపై మాట్లాడాడు.
‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బాగా సన్నద్ధమయ్యాం. ఈసారి ఎలాగైనా గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంటాం. కొంతమంది గాయాలబారిన పడినప్పటికీ మా జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉండటం సానుకూలాంశం. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన రహానే కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నా. రహానే నాణ్యమైన క్రికెటర్. అతడి అనుభవం సహచరులకు అందించాలి. ఓవర్సీస్ పరిస్థితుల్లోనూ రహానే అద్భుతంగా ఆడాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై కూడా మంచి ప్రదర్శనే ఇచ్చాడు. చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫీల్డర్‌గానూ అదరగొడతాడు. స్లిప్స్‌లో మంచి క్యాచ్‌లను అందుకోగలడు. ఈ సందర్భంగా రహానేకు ఒక్క సూచన చేస్తున్నా.. అతడి వ్యక్తిగత ప్రదర్శనను సహచరులకూ అందించాలనేది నా విజ్ఞప్తి.
కేవలం ఇదొక్క మ్యాచ్‌కు మాత్రమే కాకుండా భవిష్యత్తులోనూ ఇదే దూకుడుగా ఉండాలి. మరిన్ని టెస్టులు ఆడగల సామర్థ్యం రహానే సొంతం. గాయం నుంచి కోలుకుని వచ్చాక ఆటగాళ్లు ఎలా ఆడతారనేది ఎవరికీ తెలియదు. అలాగే, జట్టు నుంచి వైదొలిగి పునఃప్రవేశం తర్వాత పుంజుకొని ఆడగలరు. మంచి ప్రదర్శన చేస్తే చాలా మ్యాచ్‌లు ఆడే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి’’ అని ద్రవిడ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి