Rahul Dravid : మా కుర్రాళ్లు అదరగొట్టేశారు.. ఇదే కదా ప్రొఫెషనలిజమంటే..!

విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను శిఖర్ ధావన్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసేసింది. ఇక శుక్రవారం నుంచి...

Published : 29 Jul 2022 02:05 IST

టీమ్‌ఇండియా ఆటగాళ్లపై రాహుల్‌ ద్రవిడ్ అభినందనల వర్షం

ఇంటర్నెట్ డెస్క్‌: విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను శిఖర్ ధావన్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసేసింది. ఇక శుక్రవారం నుంచి ఐదు టీ20ల సిరీస్‌ జరగనుంది. ఈ క్రమంలో భారత కుర్రాళ్లు అదరగొట్టారని ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్ అభినందించాడు. ‘‘యువ జట్టుతో మేం విండీస్‌తో వన్డేలు ఆడేందుకు వచ్చాం. ఇంగ్లాండ్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు ఇక్కడ ఆడలేదు. అయితే మిగిలిన ప్లేయర్లు ఆడిన విధానం ఆకట్టుకుంది. ప్రొఫెషనిలిజం అంటే ఇదే కదా.. తొలి రెండు మ్యాచ్‌లు పోటాపోటీగా జరిగాయి. అయితే ఒత్తిడిని తట్టుకొని మరీ విజయం సాధించడం అద్భుతం’’ అని కొనియాడాడు. 

శిఖర్ ధావన్  రాణించడంతోపాటు జట్టును చాలా బాగా నడపించాడని రాహుల్‌ ప్రశంసించాడు. ‘‘శిఖర్ ధావన్ సూపర్‌గా రాణించాడు. బ్యాటర్‌గానే కాకుండా సారథిగా జట్టును బాగా నడిపించాడు. అలానే టీమ్‌ సభ్యులంతా అద్భుత ప్రదర్శన ఇచ్చారు. వర్షం వల్ల మ్యాచ్‌కు ఆటంకాలు కలిగినప్పటికీ మూడో వన్డేలో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 119 పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్ఇండియా 36 ఓవర్లలో 225/3 స్కోరు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించి విండీస్‌ లక్ష్యాన్ని 257 పరుగులుగా అంపైర్లు నిర్దేశించారు. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 137 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని