IND vs SA: విరాట్‌కి పాఠాలు చెప్పిన రాహుల్‌ ద్రవిడ్‌

త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి పలు సూచనలు చేస్తూ కనిపించాడు. ఆ ఫొటోలను..

Published : 21 Dec 2021 01:53 IST

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి పలు సూచనలు చేస్తూ కనిపించాడు. ఆ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. గత కొద్ది కాలంగా విరాట్‌ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్న విషయం తెలిసిందే. కోహ్లీ ఆడిన గత 13 టెస్టుల్లో 26 సగటుతో పరుగులు చేశాడు. అత్తుత్తమ స్కోరు 74. అయినా టెస్టుల్లో కోహ్లీ 50కి పైగా సగటుతో కొనసాగుతుండటం విశేషం. చివరి సారిగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.

విదేశీ పిచ్‌లపై సమర్థంగా రాణించేందుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి పలు సూచనలు సలహాలు తీసుకున్నాడు. సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు సంబంధించి కోహ్లీపై మరింత భారం పడినట్లయింది. మరోవైపు బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌ తదితరులు నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. సెంచూరియన్‌ వేదికగా డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని