Virat kohli: గెలుపు సంబరం.. విరాట్‌కు టీమ్‌ఇండియా ఆలింగనం: వీడియో
మ్యాచ్ అనంతరం సహచర ఆటగాళ్లు, సీనియర్లు ఈ పరుగుల వీరుడిని ప్రశంసల్లో ముంచెత్తారు.
మెల్‌బోర్న్: టీమ్‌ఇండియా సంబరాల్లో మునిగితేలుతోంది. విరాట్ కోహ్లీపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రపంచకప్‌లో పాక్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. ఓటమి అంచున నిల్చున్న టీమ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్య భాగస్వామ్యంలో అర్ధ సెంచరీని పూర్తి చేసిన ఈ బ్యాటర్ కీలక ఓవర్లో సిక్స్ బాది విజయాన్ని ఒడిసిపట్టాడు.
మ్యాచ్ అనంతరం సహచర ఆటగాళ్లు, సీనియర్లు ఈ పరుగుల వీరుడిని ప్రశంసల్లో ముంచెత్తారు. గెలుపు ఖరారు కాగానే భావోద్వేగానికి గురైన విరాట్‌ను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అతడి వెన్నుతట్టి అభినందించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘అందరూ విరాట్‌కు అభిమానులే’ అంటూ ఐసీసీ దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న విరాట్ ఆసియా కప్‌లో సెంచరీ కొట్టి నిరూపించుకున్నాడు. అనంతరం ఆసీస్ వేదికగా జరిగిన ఈ ప్రపంచ టోర్నీలో తనదైన ముద్ర వేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి