IND Vs AUS: విశాఖలో మళ్లీ భారీ వర్షం.. క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర నిరాశ

విశాఖలో భారత్‌-ఆస్ట్రేలియా(IND Vs AUS) మధ్య నేడు జరగనున్న రెండో వన్డేకు వరుణుడి అడ్డంకులు తప్పేలా లేదు.

Updated : 19 Mar 2023 10:32 IST

విశాఖపట్నం: విశాఖలో భారత్‌-ఆస్ట్రేలియా(IND Vs AUS) మధ్య నేడు జరగనున్న రెండో వన్డేకు వరుణుడి అడ్డంకులు తప్పేలా లేదు. నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. శుక్ర, శనివారం కురిసిన వర్షాలతో మ్యాచ్‌ జరగనున్న ఏసీఏ-వీడీసీఏ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఆదివారం ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో మళ్లీ భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటంతో క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఆదివారం మధ్యాహ్నం, రాత్రి కూడా వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. వర్షం తగ్గినా మ్యాచ్‌ పూర్తి ఓవర్లు సాగడం కష్టమేనని భావిస్తున్నారు. ఆదివారం కావడంతో ప్రత్యక్షంగా మ్యాచ్‌ చూసేందుకు చాలా మంది టికెట్లు కొనుగోలు చేశారు. మరోవైపు సెలవురోజు కావడంతో టీవీల్లో మ్యాచ్‌ చూసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వరుణుడు ఈ మ్యాచ్‌ను సజావుగా సాగనిస్తాడా? లేదా? అనే సందేహంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని