WTC Final: ప్చ్..! ఫైనల్‌కు వర్షగండం
ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ దుర్వార్త! సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్‌కు వర్షగడం పొంచివుంది. రిజర్వు డేతో కలిసి మొత్తం ఆరు రోజులు భారీ నుంచి సాధారణ వర్షపాతం నమోదవుతుందని సమాచారం. వాతావరణ శాఖ, వాతావరణ....
సౌథాంప్టన్: ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ దుర్వార్త! సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్‌కు వర్షగడం పొంచివుంది. రిజర్వు డేతో కలిసి మొత్తం ఆరు రోజులు సాధారణం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. వాతావరణ శాఖ, వాతావరణ వెబ్సైట్లు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. దాదాపుగా 80% వర్షం కురుస్తుందనే చూపిస్తున్నాయి.
రోజ్‌బౌల్‌లో శుక్రవారం నుంచి భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. ఇప్పటికే రెండు జట్లు తుదిపోరు కోసం కఠోర సాధన చేస్తున్నాయి. రెండూ అత్యుత్తమ జట్లే కావడంతో ఐదు రోజుల పాటు ఆటను ఆస్వాదించాలని అభిమానులు భావిస్తున్నారు. అవాంతరాలు ఎదురైనా రిజర్వు డే ఉందని సంతోషించారు. ఇప్పుడు ఆట జరిగే అన్ని రోజులూ వర్షగండం ఉందని తెలియడంతో ఉసూరుమంటున్నారు.
వర్షం పడి చల్లని వాతావరణ ఉంటే మాత్రం కివీస్‌కే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. సౌథీ, బౌల్ట్, హెన్రీ, జేమీసన్ తమ పేస్, స్వింగ్‌తో భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెడతారని అంటున్నారు. టీమ్ఇండియా బౌలర్లూ తక్కువేం కాదని మొత్తంగా బ్యాటర్లకే ఇబ్బందులు ఉంటాయని పేర్కొంటున్నారు.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ సైతం ఫైనల్‌కు పొంచివున్న వర్షగండంపై ట్వీట్ చేశారు. జూన్ 18 నుంచి 23 వరకు సౌథాంప్టన్ వాతావరణం ఎలా ఉంటుందో కొన్ని వివరాలు పోస్ట్ చేశారు. ఆట ఆరంభానికి ముందే అంటే గురువారమే వర్షం మొదలవుతుందన్నది అతడి ఉద్దేశం. ఈ ప్రకారం కోహ్లీసేన, విలియమ్సన్ కీలకమైన గురువారం సాధన చేసేందుకు అవకాశమే దొరక్కపోవచ్చు. వర్షం మొత్తంగా అంతరాయం కలిగిస్తే భారత్, న్యూజిలాండ్‌ను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.
ఇప్పటికే న్యూజిలాండ్ ఐసీసీ టోర్నీల్లో ‘టై’ గండాలు ఎదుర్కొంటోంది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మ్యాచులో, సూపర్ ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ప్రపంచకప్ ట్రోఫీ దక్కకుండా పోయింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అలాంటి పరిణామాలే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సంయుక్త విజేతగా ప్రకటించడం మాత్రం ఊరట కలిగించేదే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు