IND vs PAK: భారత్ - పాక్ పోరు.. వాతావరణం ఎలా ఉండనుందంటే?
ఆసియా కప్ 2023 ఎడిషన్‌లో భారత్-పాకిస్థాన్ (IND vs PAK) జట్ల మధ్య మరోసారి పూర్తిస్థాయి మ్యాచ్‌ను చూసే అవకాశంపై సందిగ్ధత నెలకొంది. గ్రూప్ స్టేజ్‌లో అడ్డుపడిన వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమైనట్లుగా వాతావరణ శాఖ రిపోర్ట్‌ను చూస్తే అర్థమైపోతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో (Asia Cup 2023) కీలక పోరు. సూపర్-4లో విజేతలుగా నిలిచే రెండు జట్లు ఫైనల్‌కు చేరతాయి. ఇక్కడ కూడానూ పాయింట్లు, రన్‌రేట్ కీలకం. కానీ, భారత్‌ను మాత్రం వర్షం వెంటాడుతూనే ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పాకిస్థాన్‌తో సూపర్-4లో టీమ్‌ఇండియా (IND vs PAK) తలపడనుంది. కానీ, కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్‌కూ వరుణుడు ముప్పు పొంచి ఉంది. గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌నైనా పూర్తిగా చూస్తామా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. అయితే, రిజర్వ్ డే ఉండటం అభిమానులను కాస్త ఊరటనిచ్చే అంశమే. ఈ క్రమంలో ఇవాళ కొలంబోలో వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే..?
- 12 గంటల నుంచి 3 గంటలలోపు: వాతావరణం మేఘావృతమై ఉంటుంది. అయితే, వర్షం పడే అవకాశాలు 50 శాతం లోపే. భారత్-పాక్ మ్యాచ్‌కు టాస్‌ను షెడ్యూల్ ప్రకారం 2.30 గంటలకు వేయాల్సి ఉంటుంది. చినుకులు పడకపోతే సమయానికే టాస్ వేస్తారు.
- 3 గంటలకు: సరిగ్గా మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి వర్షం సూచనలు 66 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. మెరుపులు ఉరుములతో కూడిన వర్షం పడొచ్చు.
- 4 గంటల నుంచి 5 గంటల వరకు: మధ్యాహ్నం 3 గంటల సమయంలో వర్షం పడినా కాసేపు మాత్రమే ఉండనుంది. మబ్బులు ఎక్కువగా ఉన్నప్పటికీ వరుణుడు శాంతించే అవకాశం ఉంది.
- 6 గంటలకు: మళ్లీ వరుణుడు అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. ఎంత సమయం పడుతుందనే దానిపై తదుపరి మ్యాచ్ నిర్వహణ ఆధారపడి ఉంటుంది.
- 7 గంటలకు: ఈ సమయంలో వర్షం ఆగినప్పటికీ మేఘావృతమై ఉంటుంది. వాతావరణంలో తేమ 84% వరకు ఉంటుంది.
- 8 గంటల నుంచి 10 గంటల వరకు: ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు వర్షం పెరిగే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ పూర్తిస్థాయిలో జరగడం అనుమానస్పదమే. రాత్రి 10.30లోపు వర్షం ఆగి మ్యాచ్ సిద్ధం కాకపోతే రిజర్వ్ డేకి వెళ్లిపోవడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: మాజీ మంత్రి బండారుకు నారా లోకేశ్ ఫోన్
-
PM Modi: అభివృద్ధిపై వాళ్లకు విజన్, రోడ్‌మ్యాప్ లేవు.. విపక్షాలపై మోదీ ఫైర్
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
-
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..