IND Vs SA : నేటి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం..

గువహటిలోని బర్సాపరా స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు  భారత్‌-దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. అయితే.. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 02 Oct 2022 12:49 IST

గువహటి :  భారత్‌-దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అక్కడి వాతావరణ శాఖ ఈ మేరకు అప్‌డేట్‌ ఇచ్చింది. గువహటిలోని బర్సాపరా స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే.. గువహటిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ‘ఆక్యూవెదర్‌’ తెలిపింది. మూడు గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. స్టేడియంలో మ్యాచ్‌ వీక్షించేందుకు టికెట్లు కొన్న అభిమానులు ఈ వార్తతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి.

మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్‌ కవర్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్లు అస్సాం క్రికెట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.

ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ ఇండియా.. రెండో టీ20లోనూ గెలుపుతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌ విజయంతో టీ20 ప్రపంచకప్‌లోకి  సగర్వంగా అడుగుపెట్టాలని రోహిత్‌ సేన చూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని