RR vs MI: ముంబయి ఛేదించేనా?

ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగుల స్కోర్‌ సాధించింది...

Updated : 29 Apr 2021 17:41 IST

రాణించిన రాజస్థాన్‌.. రోహిత్‌సేన టార్గెట్‌ 172

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగుల స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌(41; 32 బంతుల్లో 3x4, 3x6), యశస్వి జైశ్వాల్‌(32; 20 బంతుల్లో 2x4, 2x6) శుభారంభం చేశారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరినీ రాహుల్‌ చాహర్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపాడు. 8వ ఓవర్‌లో బట్లర్‌ను స్టంపౌట్‌ చేసిన ముంబయి స్పిన్నర్‌ తన తర్వాతి ఓవర్‌లో యశస్విని క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికి రాజస్థాన్‌ పది ఓవర్లకు 91/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. ఆపై కెప్టెన్‌ సంజూ శాంసన్‌(42; 27 బంతుల్లో 5x4), శివమ్‌దూబె(35; 31 బంతుల్లో 2x4, 2x6) రాణించినా చివర్లో ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యారు. బౌల్ట్‌ సంజూను బౌల్డ్‌ చేయగా దూబెను బుమ్రా బుట్టలో వేసుకున్నాడు. చివరికి డేవిడ్‌ మిల్లర్‌(7), రియాన్‌ పరాగ్‌(8) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని