IPL 2023: ధోనీ మేనియాగా ఈ ఐపీఎల్‌ సీజన్‌ : రమీజ్‌ రజా

ఈ ఐపీఎల్‌ ధోనీ మేనియాగా గుర్తుండిపోతుందని పీసీబీ మాజీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా(Ramiz Raja) వివరించాడు.

Updated : 02 Jun 2023 13:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఈ ఐపీఎల్‌(IPL 2023)లో ముంబయి రికార్డు సమం చేసి ఐదో సారి టైటిల్‌ గెలిచిన ధోనీ సేన(Chennai Super Kings)పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దాయాది దేశం పాక్‌ మాజీ ఆటగాళ్లు సైతం ధోనీ(MS Dhoni)ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా పీసీబీ(PCB) మాజీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా(Ramiz Raja).. ఈ సీజన్‌ ధోనీ కోసం గుర్తుండిపోతుందన్నారు.

‘ఈ ఐపీఎల్‌ ధోనీ కోసం, పసుపు జెర్సీ కోసం గుర్తుండిపోతుంది. ధోనీ మేనియా, అతడి కెప్టెన్సీ, వినయం, ప్రశాంతత, అతడి కీపింగ్‌ నైపుణ్యాలు.. అన్ని తరాల వారికి గుర్తుండిపోతాయి. ఈ సీజన్‌లో అన్నింటికంటే.. ముఖ్యంగా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ తన షర్ట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్న క్షణం ఎప్పటికీ నిలిచిపోతుంది. ధోనీకి ఇంతకంటే పెద్ద ప్రశంసలు ఉండవు. రింకు సంగ్‌, శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ లాంటి యువ బ్యాటింగ్‌ టాలెంట్‌ను ఈ ఐపీఎల్‌ వెలుగులోకి తీసుకువచ్చింది. రాబోయే చాలా సంవత్సరాలు ఈ మైదానాలను అలంకరించే తారలు వీరే’ అంటూ తనదైన శైలిలో రజా ఐపీఎల్‌ను తన యూట్యూబ్‌ ఛానల్‌లో విశ్లేషించాడు.

ఇక ఈ 16వ ఎడిషన్‌ను అత్యుత్తమ సీజన్‌గా రజా పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్‌ బెంచ్‌పై ఉన్న పెద్ద ఆటగాళ్లకు.. అలాగే చిన్న దేశాల నుంచి వచ్చి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఒక జ్ఞాపకంగా మిగిలిసోతుందన్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇంత పెద్ద ప్రదర్శన ఎప్పుడూ జరగలేదు’ అని రజా వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని