Dinesh Karthik: కోహ్లీగా రణ్‌బీర్‌.. పంత్‌ రోల్‌కు నాని: క్రికెటర్ల బయోపిక్‌లకు డీకే సలహా

Dinesh Karthik: టీమ్‌ఇండియా క్రికెటర్ల జీవితాలపై సినిమాలు తీస్తే అందులో ఎవరెవరు నటించాలో సలహాలిచ్చాడు దినేశ్‌ కార్తిక్‌. కోహ్లీ పాత్రకు రణ్‌బీర్‌ అయితే బాగుంటాడని అన్నాడు.

Published : 19 Jun 2024 19:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సూపర్‌ 8 పోరుకు సన్నద్ధమవుతోంది టీమ్‌ఇండియా. జూన్‌ 20న అఫ్గానిస్థాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలను వెండితెరపైకి తీసుకొస్తే.. అందులో ఎవరు నటిస్తే బాగుంటుందో డీకే కొన్ని సలహాలు చెప్పాడు. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) బయోపిక్‌లో బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ సరిగ్గా సరిపోతాడని అన్నాడు.

‘‘కోహ్లీ జీవితంపై సినిమా తీస్తే.. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడు. ఆ నటుడు క్రికెట్‌ ఆడటం నేనెప్పుడూ చూడలేదు కానీ.. కోహ్లీ ఆటతీరును సరిగ్గా ప్రదర్శించగలడని అనుకుంటున్నా’’ అని అన్నాడు. ఇక, టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)పై బయోపిక్‌ తీస్తే.. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) అందులో నటించాలని చెప్పాడు.

అంతేకాదు.. యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ (Rishabh Pant')పై సినిమా తీస్తే తెలుగు నటుడు నాని (Nani) సరిగ్గా నప్పుతాడని డీకే తెలిపాడు. ‘‘శిఖర్‌ ధావన్‌గా అక్షయ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ పాత్రకు సునీల్‌ శెట్టి, హార్దిక్‌ పాండ్యా బయోపిక్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, చాహల్‌పై సినిమా తీస్తే బాలీవుడ్‌ కమెడియన్‌ రాజ్‌పాల్ యాదవ్‌, బుమ్రా రోల్‌కైతే రాజ్‌ కుమార్‌ రావ్‌ బాగుంటారు’’ అని అన్నాడు. చివరగా.. ఒకవేళ తన జీవితంపై ఎవరైనా సినిమా తీస్తే ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ ఫేమ్‌ విక్రాంత్‌ మాస్సే తన పాత్రలో నటించాలని సూచించాడు .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని