Ranji Trophy : రంజీల్లో సీనియర్‌ క్రికెటర్లు.. సౌరాష్ట్ర జట్టులో పుజారా.. ముంబయి తరఫున రహానె

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా రంజీల్లో ఆడనున్నారు. వీళ్లిద్దరూ గత కొద్ది కాలంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం..

Published : 09 Feb 2022 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా రంజీల్లో ఆడనున్నారు. వీళ్లిద్దరూ గత కొద్ది కాలంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు రంజీలపై దృష్టి సారించారు.

 సౌరాష్ట్ర జట్టు తరఫున ఛెతేశ్వర్‌ పుజారా ఆడనున్నాడు. ఈ జట్టుకు జయదేవ్‌ ఉనద్కత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉండగా.. ముంబయి జట్టు నుంచి అజింక్య రహానె బరిలోకి దిగనున్నాడు. యువ ఆటగాడు పృథ్వీ షా ముంబయి జట్టుకి సారథ్యం వహించనున్నాడు. సచిన్‌ తెందూల్కర్ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌తో పాటు ఆదిత్య తారె, ధవల్ కులకర్ణి, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్‌ ఖాన్‌, శివమ్‌ దూబె తదితర ఆటగాళ్లు ముంబయి జట్టు తరఫున ఆడనున్నారు.

కరోనా కారణంగా గతేడాది రంజీ ట్రోఫీని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి రెండు విడతల్లో టోర్నీని నిర్వహించనున్నారు. తొలి విడత మ్యాచులు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల ప్రకారం.. ఆటగాళ్లందరూ ఐదు రోజుల క్వారంటెయిన్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. రాజ్‌కోట్‌, కటక్‌, అహ్మదాబాద్‌, చెన్నై, తిరువనంతపురం, దిల్లీ, హరియాణా, గువాహటి, కోల్‌కతా వేదికల్లో ఈ మ్యాచులు జరుగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని