Ranji Trophy: రంజీ ట్రోఫీ.. 25 పరుగులకే ఆలౌటైన నాగాలాండ్..

రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులకే ఆలౌటైంది. టోర్నీలో చరిత్రలో అత్యల్ప స్కోర్లలో ఇది నాలుగవది.

Published : 16 Dec 2022 21:11 IST

ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా   నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఉత్తరాఖండ్ 282 పరుగులకు ఆలౌట్‌ కాగా.. నాగాలాండ్‌ 389 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఉత్తరాఖండ్ 306 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసి నాగాలాండ్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో నాగాలాండ్ 18 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యల్ప స్కోర్లలో ఇది నాలుగోది. ఆ జట్టులో నగాహో చిషి (10) ఒక్కడే రెండంకెల స్కోరు సాధించాడు. ఈ పది వికెట్లలో తొమ్మిది ఇద్దరు బౌలర్లు పడగొట్టినవే.. ఒకరు రనౌట్‌ అయ్యారు. మయాంక్‌ మిశ్రా (5/4), స్వప్నిల్ సింగ్ (4/5) నాగాలాండ్‌ బ్యాటర్లను బెంబెలెత్తించారు. 


రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు టాప్‌ 10 అత్యల్ప స్కోర్లు 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని