Published : 09 May 2022 10:44 IST

Virat Kohli: కోహ్లీ గోల్డన్‌ డక్‌తో నిరాశపర్చినా.. విలువ తగ్గదు : రణ్‌వీర్‌సింగ్

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ మరోసారి గోల్డన్‌ డకౌటయ్యాడు. దీంతో ఈ సీజన్‌లో మూడు సార్లు ఇలా పెవిలియన్‌ చేరి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. కొంత కాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్‌.. ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లోనూ మరీ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజా మ్యాచ్‌లో మరోసారి ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. మొత్తంగా ఈ టీ20 లీగ్‌లో కోహ్లీ గోల్డన్‌ డకౌటవ్వడం ఇది ఆరోసారి.

అయితే, కోహ్లీ ఇంత దారుణంగా విఫలమవుతున్నా అభిమానులు మాత్రం అండగా నిలుస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ తాము మద్దతు తెలుపుతామని అంటున్నారు. ఈ జాబితాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ సైతం చేరాడు. ఆదివారం మ్యాచ్‌ జరుగుతుండగా ఆయన మాట్లాడుతూ.. ‘కోహ్లీ ఇలా తొలి బంతికే ఔటవ్వడం చూస్తుంటే బాధగా ఉంది. అయితే, ఈ వైఫల్యాలతో అతడి స్థాయి పడిపోదు. అతడు ఎప్పటికీ మేటి క్రికెటరే. అతడు ఈ చెడు దశ నుంచి బయటపడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే రాబోయే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున రాణించాలని ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నాడు. మరోవైపు మ్యాచ్‌ అనంతరం జట్టు విజయంపై కోహ్లీ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు సైతం అభిమానుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అతడెంత విఫలమైనా ఎప్పటికీ తన వెంటే ఉంటామని కామెంట్లు చేశారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని