Rashid Khan: టీ20ల్లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత.. రెండో క్రికెటర్‌గా రికార్డు
రషీద్ ఖాన్ (Rashid Khan) అఫ్గానిస్థాన్ క్రికెటర్. అయితే అతడి బౌలింగ్ ప్రతిభను భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ (IPL)లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో (SA T20)నూ ఆడుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో హైదరాబాద్ తరఫున ఆడిన రషీద్ ఖాన్.. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తన జాతీయ జట్టు అఫ్గానిస్థాన్‌తోపాటు విదేశాల్లోనూ పలు లీగుల్లో రషీద్ ఆడుతున్నాడు. టీ20ల్లో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందాడు. కీలక సమయాల్లో బంతిని ఇస్తే తప్పకుండా వికెట్ తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతాడనే నమ్మకం అభిమానికి కలిగేలా చేస్తాడు. తాజాగా టీ20 ఫార్మాట్‌లో ఓ ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇలా నిలిచిన రెండో బౌలర్‌గా అవతరించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..?
ప్రస్తుతం రషీద్ ఖాన్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబయి కేప్‌టౌన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు ఆటగాడు క్లైడ్ ఫోర్టుయిన్ వికెట్‌ను తీశాడు. ఇందులో కొత్త ఏముందని విసుక్కోవద్దు.. ఇది రషీద్ ఖాన్‌కు టీ20ల్లో 500వ వికెట్ కావడమే అసలైన విశేషం. ఇలా లీగ్‌లు, జాతీయ, అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో కలిపి 500 వికెట్ల మైలురాయిని తాకిన రెండో బౌలర్ రషీద్ ఖాన్. అంతర్జాతీయ టీ20ల్లో 122 వికెట్లను తీసిన రషీద్.. మిగతావన్నీ లీగ్‌లు, దేశీయ స్థాయిలో పడగొట్టిన వికెట్లు. తొలుత ఈ ఘనతను వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సాధించాడు. బ్రావో టీ20ల్లో ఇప్పటి వరకు 619 వికెట్లను తీసి అగ్ర స్థానంలో ఉన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు