Ashwin: ‘అశ్విన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ కాదు.. రోహిత్ నోరుజారాడు’

ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టులో టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. కపిల్‌దేవ్‌ని (434 వికెట్లు) వెనక్కినెట్టి  భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (436)

Published : 11 Mar 2022 01:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టులో టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. కపిల్‌దేవ్‌ని (434 వికెట్లు) వెనక్కినెట్టి  భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (436) పడగొట్టిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్‌ అశ్విన్‌పై టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని  ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’గా అభివర్ణించాడు. దీనిని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్ లతీఫ్‌ తప్పుబట్టాడు. అశ్విన్‌ గొప్ప బౌలరే.. కానీ ఇంకా ఆల్‌టైమ్‌ గ్రేట్‌ జాబితాలోకి చేరలేదని చెప్పుకొచ్చాడు. 

‘అశ్విన్ గొప్ప బౌలర్‌. ఇందులో ఎటువంటి సందేహం లేదు.  అతడు బౌలింగ్‌లో మంచి వైవిధ్యం ఉంది. స్వదేశీ పిచ్‌లపై  అతడిని రికార్డుని పరిశీలిస్తే భారత్‌లో అతడే అత్యుత్తమ స్పిన్నర్‌. రోహిత్‌ శర్మ చెప్పినట్టుగా అశ్విన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ కాదు. విదేశీ పిచ్‌లపై అశ్విన్‌ ప్రభావం చూపలేడు.  అతడి కంటే అనిల్ కుంబ్లే,  బిషన్ సింగ్ బేడీ మెరుగ్గా రాణించారు. ప్రస్తుతం ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణిస్తు న్నాడు. అశ్విన్‌ విషయంలో రోహిత్‌ శర్మ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను.  నాకు తెలిసి రోహిత్‌ నోరుజారాడు.  ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇదో మార్గం’ అని  రషీద్‌ లతీఫ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని