Ravi Bishnoi: ప్రాక్టీస్‌కు వెళ్లినప్పుడు నేనెంతో కంగారు పడ్డాను: రవి బిష్ణోయ్‌

తొలిసారి టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లినప్పుడు ఎంతో కంగారు పడ్డానని, ఆ సమయంలో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వాగతం పలికి జట్టులోకి ఆహ్వానించడంతో చాలా సంతోషంగా అనిపించిందని...

Published : 17 Feb 2022 13:50 IST

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలిసారి టీమ్‌ఇండియా జట్టును కలిసినప్పుడు ఎంతో కంగారు పడ్డానని, ఆ సమయంలో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వాగతం పలికి జట్టులోకి ఆహ్వానించడంతో చాలా సంతోషంగా అనిపించిందని యువ లెగ్‌ స్పిన్నర్ రవిబిష్ణోయ్‌ అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో అరంగేట్రం చేసిన బిష్ణోయ్‌.. తొలి మ్యాచ్‌లోనే (2/17) అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం చాహల్‌తో మాట్లాడిన బిష్ణోయ్‌.. తొలిసారి తాను జట్టులోకి వచ్చిన నాటి అనుభవాలను గుర్తుచేసుకున్నాడు.

‘టీమ్‌ఇండియాలో ఆడాలని ఎవరైనా కలగంటారు. నేను కూడా అలాగే ఆశించాను. అయితే, జట్టులోకి వచ్చినప్పుడు ఎంత సంబరపడ్డానో అంతే కంగారుగా అనిపించింది. ప్రాక్టీస్‌ చేసేందుకు జట్టుతో కలిసి వెళ్లినప్పుడు అక్కడ సీనియర్ల ముందు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ నాకు స్వాగతం పలకడం చాలా గొప్పగా అనిపించింది. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో సీనియర్లతో కలిసి సాధన చేయడం కూడా ఆస్వాదించాను. అయితే, నేనింకా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. జట్టు విజయాల కోసం నా వంతు కచ్చితంగా ప్రయత్నిస్తా’ అని రవి పేర్కొన్నాడు. ఇక చాహల్‌తో అరంగేట్రం టోపీ అందుకోవడం తనకు సంతోషంగా, ప్రత్యేకంగా అనిపించిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో అవకాశం వచ్చి తన శక్తిమేరకు బౌలింగ్‌ చేశానని, దీంతో అత్యుత్తమ ప్రదర్శన చేయగలిగానని తెలిపాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ పరుగులు ఎక్కువ చేయకుండా సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయాలనుకున్నట్లు తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని