Ravi Bishnoi : కొత్త చర్చకు తెరలేపిన రవి బిష్ణోయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ..!

టీమ్‌ఇండియా యువ ఆటగాడు రవి బిష్ణోయ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన...

Published : 21 Sep 2022 02:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఆటగాడు రవి బిష్ణోయ్‌ కొత్త చర్చకు తెరతీశాడు. ఏదో వ్యాఖ్యలు చేసి కాదు సుమా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. టీ20 ప్రపంచకప్‌ జట్టులో బిష్ణోయ్‌ స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన స్క్వాడ్‌తోపాటు మరో నలుగురిని రిజర్వ్‌ ఆటగాళ్లుగా తీసుకొంది. అందులో సీనియర్‌ బౌలర్‌ మహమ్మద్ షమీ, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్‌ దీపక్ చాహర్‌తోపాటు స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో తాజాగా రవి బిష్ణోయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘సూర్యుడు ఉదయిస్తాడు.. మేం మళ్లీ ప్రయత్నిస్తాము’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. టీ20ప్రపంచకప్‌ కోసం జట్టు ప్రకటన తర్వాత తొలిసారి రవి బిష్ణోయ్‌ స్పందించాడు. దేని గురించి ఇలా స్టోరీ పెట్టాడో అని అభిమానులు చర్చించుకొంటున్నారు. 

(ఫొటో సోర్స్‌: రవి బిష్ణోయ్ ఇన్‌స్టాగ్రామ్‌)

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ కోసం అన్ని జట్లూ సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌ కూడా రెండు టీ20 సిరీస్‌లతోపాటు వన్డే సిరీస్‌ను ఆడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఇవాళ మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఆసీస్‌తో సిరీస్‌ ముగిశాక.. దక్షిణాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌లను టీమ్‌ఇండియా ఆడనుంది. ఇవన్నీ స్వదేశంలోనే కావడం గమనార్హం. ఈ సిరీస్‌లు ముగిశాక డైరెక్ట్‌గా భారత్‌ టీ20 ప్రపంచకప్‌ బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్‌లోనే దాయాది దేశం పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని