Dinesh Karthik: రవి భాయ్‌.. నీవు నేర్పిన విద్యయే

నాగ్‌పూర్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ చివరి ఓవర్లో కొట్టిన షాట్లను తక్కువ చేసి చూపించేలా వ్యాఖ్యానించిన మాజీ కోచ్‌ రవిశాస్త్రికి ఊహించని సమాధానం ఎదురైది. శుక్రవారం

Updated : 25 Sep 2022 14:24 IST

 మాజీ కోచ్‌కు దినేష్‌ కార్తిక్‌ చురక

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగ్‌పుర్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ చివరి ఓవర్లో కొట్టిన షాట్లను తక్కువ చేసి చూపించేలా వ్యాఖ్యానించిన మాజీ కోచ్‌ రవిశాస్త్రికి ఊహించని సమాధానం ఎదురైంది. శుక్రవారం నాగ్‌పుర్‌లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ చివరి ఓవర్‌లో డీకే.. సిక్సు, ఫోర్‌ బాది భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పోస్టు మ్యాచ్‌ ఇంటర్వ్యూ సందర్భంగా డీకే వద్దకు రవిశాస్త్రి వచ్చి ‘‘ఈజీ గేమ్‌, డీకే. రెండు బంతులు, చాలా తేలిక (‘పీస్‌ ఆఫ్‌ కేక్‌’ అనే నుడికారం వాడుతూ). సిక్స్‌, ఫోర్‌, ధన్యవాదాలు’’ అని ముగించాడు.

రవి శాస్త్రి మాటల్లోని వ్యంగ్యాన్ని డీకే అర్థం చేసుకొన్నాడు. దీనికి సమాధానం చెబుతూ రవిశాస్త్రి కోచింగ్‌ సంగతులను గుర్తు చేశాడు. ‘‘తేలికైన గేమ్‌ అంటూ ఏదీ ఉండదు’ అని నాకు నేర్పిన వ్యక్తుల్లో నువ్వు ఒకడివి. రవీభాయ్‌.. ప్లీజ్‌, ఇప్పుడు నువ్వే ఆ మాట నుంచి వెనక్కి తప్పుకోవద్దు. ఇది చాలా కష్టమైన గేమ్‌. ఎలానో నీకు బాగా తెలుసు’’ అంటూ కార్తీక్‌ సమాధానం ఇచ్చాడు. మూడేళ్లపాటు టీమ్‌ ఇండియాకు దూరమైన కార్తిక్‌ తీవ్రంగా శ్రమించి తిరిగి జట్టులో స్థానం దక్కించుకొన్నాడు. పునరాగమనం తర్వాత నుంచి మ్యాచ్‌ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts