Ravi Shastri: ‘విరాట్‌ కోహ్లీ వర్సెస్‌ రోహిత్‌ శర్మ’పై రవిశాస్త్రి ఏమన్నాడంటే..!

టీమ్‌ ఇండియాలో మార్పులు చోటు చేసుకోనున్నాయంటూ ఇటీవల ఆన్‌లైన్‌లో జరుగుతున్న చర్చపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందించారు. 

Published : 04 Dec 2022 12:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘విరాట్‌ కోహ్లీ - రోహిత్‌ శర్మ’ మధ్య పోటీ అంశంపై భారత క్రికెట్‌ అభిమానులు తరచూ రెండుగా విడిపోతుంటారు. టీమ్‌ ఇండియా మాజీ కోచ్‌, వ్యాఖ్యాత రవిశాస్త్రి దీనిపై తనదైన శైలిలో స్పందించాడు. ఇటీవల కెప్టెన్‌గా రోహిత్‌ తొలిసారి ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ, భారత్‌ సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటిమిపాలైంది. దీంతో టీమ్‌ ఇండియా వ్యూహాల్లో మార్పులు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. రోహిత్‌ను మారుస్తారంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం కూడా మొదలైంది. ‘కోహ్లీ-శర్మ’ నాయకత్వాలను పోల్చడం వంటివి జోరుగా జరుగుతున్నాయి. దీంతో వీరిద్దరి గురించి మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో  స్పందించాడు.

‘‘వాళ్లంతా మల్లగుల్లాలు పడుతున్నారు(ఆన్‌లైన్‌లో చర్చించే వారిని ఉద్దేశించి). మీ అందరికీ అది టైమ్‌పాస్‌. అలాంటి విషయాలకు నా వద్ద సమయం లేదు. వారిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. అంతా అద్భుతంగా జరుగుతోంది. మరోవైపు మీరు ఇక్కడ కూర్చొని కిచిడీ వండుతున్నారు. నాకు దీనికి టైం లేదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. 

ఇటీవల న్యూజిలాండ్‌ సిరీస్‌లో యువకుల ఆటతీరును శాస్త్రి ఆకాశానికెత్తేశాడు. ‘‘వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా ఆడుతున్నాడు.. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ చేసే తీరు చాలా బాగుంది. అతడిలో మంచి ప్రతిభ ఉంది. అతడు దానిని నిలబెట్టుకోగలిగితే ఇంకా మంచిది. మొత్తంమీద ఇన్నింగ్స్‌ ప్రారంభంలో శుభమన్‌గిల్‌ చాలా సానుకూలంగా ఆడుతున్నాడు. అక్కడ మైదానాల్లో చాలా కఠిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు తరచూ ఎదురుకావు. మీరు న్యూజిలాండ్‌కు తరచూ వెళ్లరు. అందుకే.. యువ క్రికెట్లరకు ఈ పర్యటన చాలా ప్రయోజనకరం. వారు ఇటువంటి పరిస్థితుల నుంచి అద్భుతంగా నేర్చుకొన్నారు. ముఖ్యంగా వాతావరణం, మైదానం కొలతలను పరిగణనలోకి తీసుకొవాలి’’ అని శాస్త్రి వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని