Surya Kumar Yadav : అందుకే అందరూ ‘సూర్య నమస్కార్‌’ చెప్పాలి: రవిశాస్త్రి

క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును ఆదుకునేందుకు కీలక ఇన్నింగ్స్ ఆడిన...

Published : 11 Apr 2022 02:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును ఆదుకునేందుకు కీలక ఇన్నింగ్స్ ఆడిన ముంబయి బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌పై టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా నాలుగో స్థానంలో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్ (68) నిలకడగా ఆడి అర్ధశతకం సాధించాడు. ఈ సీజన్‌లో ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. మ్యాచ్‌లో ముంబయి ఓడినా సూర్యకుమార్‌ ఆట మాత్రం ఆకట్టుకుందని రవిశాస్త్రి అభినందించాడు. సూర్యకుమార్‌ స్ట్రోక్‌ ప్లే ఎంతో నాణ్యంగా ఉందని పేర్కొన్నాడు. 

‘‘వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఎంతో సాధికారికంగా ఆడాడు. రెండు అర్ధశతకాలు సాధించడం నమ్మశక్యం కాని విషయం. అయితే బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌ మాత్రం స్పెషల్‌. ఎందుకంటే ఓ పక్కన వికెట్లు పడుతున్నా తుదవరకు క్రీజ్‌లో ఉండి పోరాడే లక్ష్యం సమకూర్చాడు. 50/0 నుంచి 80/6కి చేరిన జట్టు చివరి ఐదు ఓవర్లలో  71 రన్స్‌ చేసిందంటే సూర్యకుమార్‌ ఎంత దూకుడుగా ఆడాడో తెలిసిపోతుంది. తిలక్‌ వర్మ, పొలార్డ్‌ డకౌట్‌లు వెనుదిరిగిన వేళ ఉనద్కత్‌ అండగా సూర్యకుమార్‌ చెలరేగాడు. అందుకే ముంబయి ఆటగాళ్లకు ఒకటే చెబుతున్నా.. మీరంతా ‘సూర్య నమస్కార్‌’ అని చెబుతూ ఉండండి’’ అని రవిశాస్త్రి వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని