Harshal Patel : డెత్‌ ఓవర్లలో హర్షల్‌ రాటుదేలాడు: రవిశాస్త్రి

బెంగళూరు బౌలర్‌ హర్షల్‌ పటేల్‌పై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల ..

Published : 01 Apr 2022 16:55 IST

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు బౌలర్‌ హర్షల్‌ పటేల్‌పై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించారు. డెత్‌ ఓవర్లలో స్పెషలిస్ట్‌ బౌలర్‌గా వృద్ధి చెందేందుకు హర్షల్‌ ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. కోల్‌కతా ప్రమాదకర బ్యాటర్లు సామ్‌ బిల్లింగ్స్‌, ఆండ్రూ రస్సెల్‌ క్రీజ్‌లో ఉన్నప్పుడు కూడానూ హర్షల్‌ రెండు ఓవర్లు మెయిడిన్‌గా వేయడం అద్భుతమని పేర్కొన్నాడు. కోల్‌కతాను 128 పరుగులకే కుప్పకూల్చడంతో హసరంగ (4/20), ఆకాశ్‌ దీప్‌ (3/45)తోపాటు హర్షల్‌ పటేల్‌ (2/11) కీలక పాత్ర పోషించాడు. 

‘‘భారత జట్టుతో ఉన్నప్పుడు హర్షల్‌తో మాట్లాడా. అతడికి తన బౌలింగ్‌ సత్తా ఏంటో తెలుసు. తన బౌలింగ్‌పై ఎంతో నమ్మకంగా ఉంటాడు. అదెలా ఉంటుందో ఆండ్రూ రస్సెల్‌ వంటి భారీ హిట్టర్‌ను క్రీజ్‌లో పెట్టుకుని మెయిడిన్లు వేసి చూపించాడు. ఏ విధంగా బౌలింగ్‌ వేయాలో తన బ్రెయిన్‌లో ముందే అనుకుని ఉంటాడు. బౌలింగ్‌ యాక్షన్‌లోనూ పరిణితి కనిపించింది. డెత్‌ ఓవర్లలో మరింత నాణ్యమైన బౌలింగ్‌ చేస్తున్నాడు’’ అని రవిశాస్త్రి వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని