Ravi Shastri:‘ఆడికారు’ కోసం రవిశాస్త్రితో గొడవపడిన పాకిస్థాన్‌ కెప్టెన్‌!

ఆస్ట్రేలియాలో నిర్వహించిన 1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ని అప్పటి క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మార్చిపోలేరు. ఎందుకంటే.. ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌లో సునీల్ గవాస్కర్‌ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్‌ని ఓడించి

Published : 06 Jun 2022 01:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌:ఆస్ట్రేలియాలో నిర్వహించిన 1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ని అప్పటి క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మార్చిపోలేరు. ఎందుకంటే.. ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌లో సునీల్ గవాస్కర్‌ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్‌ని ఓడించి కప్‌ని ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో రవిశాస్త్రి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్‌లో ఒక వికెట్ తీయడంతోపాటు 63 పరుగులు చేసి జట్టులో విజయం కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచి ‘ఆడి కారు’ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్‌లో గెలుపొందిన రవిశాస్త్రి ఆడి కారు డ్రైవ్‌ చేయగా..  భారత ఆటగాళ్లు దానిపై కూర్చుని సంబరాలు చేసుకున్నారు. 

అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ తనపై స్లెడ్జింగ్‌ చేశాడని రవిశాస్త్రి తాజాగా వెల్లడించాడు. ఆడి కారు గురించి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టాడు. ‘జావెద్‌ మియాందాద్‌ మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ నా దగ్గరికి వచ్చి.. నువ్వు మళ్లీ మళ్లీ అక్కడేం చూస్తున్నావ్‌..  కారును ఎందుకు చూస్తున్నావ్‌.. అది నీకు దక్కదు అంటూ వెటకారంగా మాట్లాడాడు. దీనికి కౌంటర్‌గా.. జావెద్‌ నేను అటు వైపు చూడడం లేదు. ఆ కారే నా వైపు చూస్తోంది. నా ఇంటికి వస్తుంది’ అని సమాధానం ఇచ్చానని రవిశాస్త్రి తెలిపాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని