Published : 21 Feb 2022 15:00 IST

Ravi Shastri: గంగూలీ చొరవ తీసుకోవాలి.. సాహాను బెదిరించిన జర్నలిస్టును కనిపెట్టాలి : శాస్త్రి

సాహాకు అండగా టీమ్‌ఇండియా మాజీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను ఇంటర్వ్యూ చేయడానికి బెదిరింపులకు పాల్పడిన జర్నలిస్టు ఎవరో గుర్తించి.. చర్యలు తీసుకోవాలని మాజీ కోచ్‌ రవిశాస్త్రి కోరాడు. ఒక ఆటగాడిని జర్నలిస్టు బెదిరించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. సదరు జర్నలిస్టు ఎవరో కనిపెట్టాలని, ఈ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చొరవ చూపాలని శాస్త్రి ఓ ట్వీట్‌లో కోరాడు. ఇలాంటి సంఘటనలు టీమ్‌ఇండియాలో చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు.

సాహా ఇంటర్వ్యూ కోసం ఇటీవల ఓ జరలిస్టు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వాట్సాప్‌ మెసేజీల స్క్రీన్‌షాట్‌ను టీమ్‌ఇండియా టెస్టు కీపర్‌ ట్విటర్‌లో బహిర్గతం చేశాడు. ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఈ విషయంపై తీవ్ర దుమారం రేగింది. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రితో సహా పలువురు టీమ్‌ఇండియా మాజీలు సాహాకు అండగా నిలిచారు. వీరేందర్‌ సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా సైతం ట్వీట్లు చేశారు. ఆ జర్నలిస్టు ఎవరో చెప్పాలని కోరారు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని