Ravi Shastri: వన్డేలను 40 ఓవర్లకు కుదించాలి: రవిశాస్త్రి
వన్డే క్రికెట్ గురించి టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే క్రికెట్ మనుగడ సాగించాలంటే ఈ ఫార్మాట్‌ను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిప్రాయపడ్డాడు. 1983లో భారత్ ప్రపంచకప్ గెలిచిన సమయంలో వన్డేలు 60 ఓవర్లపాటు జరిగాయని గుర్తు చేస్తూ.. అభిమానుల ఆసక్తి తగ్గడంతో 50 ఓవర్లకు కుదించారని చెప్పాడు. వన్డేలను 40 ఓవర్లకు తగ్గించడానికి ఇదే సరైన సమయమని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
‘‘వన్డే క్రికెట్ మనుగడ సాగించాలంటే భవిష్యత్తులో ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాలని భావిస్తున్నా. నేను ఇలా చెప్పడానికి కారణం.. 1983లో మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు వన్డేలు 60 ఓవర్లపాటు జరిగేవి. తర్వాత అభిమానుల ఆసక్తి తగ్గడంతో 50 ఓవర్ల ఆటగా మారింది. వన్డేలు 40 ఓవర్ల ఆటగా మారడానికి సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. కాలానికి తగినట్టుగా మన ఆలోచనలూ మారాలి. వన్డే ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాలి’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టీ20ల గురించి మాట్లాడుతూ.. క్రికెట్‌కు టీ20 ఫార్మాట్ కీలకమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దేశీయ లీగ్‌లు తగినన్ని ఉన్నందున ద్వైపాక్షిక సిరీస్‌లను తగ్గించాలని సూచించాడు. టెస్ట్ క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/06/23)