Ravi Shastri: కోహ్లీ, రోహిత్ ఫామ్.. వారంతా ఆ దశను దాటి వచ్చినవారే: రవిశాస్త్రి
టీమ్ఇండియాలో కీలక ఆటగాళ్లుగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీల ఫామ్ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియాలో కీలక ఆటగాళ్లుగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీల ఫామ్ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఆసియా కప్ నుంచి విరాట్ ఆటతీరు మెరుగుపడగా.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అతడు మంచి ప్రదర్శనే కనబర్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంతో విమర్శల పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫామ్ లేమిపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ప్రతి క్రికెటర్ జీవితంలో ఇలాంటి దశ సహజమేనని.. సునీల్ గావస్కర్ మొదలుకుని కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ వరకు ఎంతో మంది ఈ దశను దాటి వచ్చినవారేనని రవిశాస్త్రి గుర్తు చేశారు.
‘ప్రతి క్రికెటర్‌కి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్, ధోనీ సహా ఎంతో మంది ఈ దశను తప్పించుకోలేకపోయారు. ప్రతి ఒక్కరికీ వారి సమయం అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆటగాళ్లపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది సెంటిమెంట్‌గా మారింది. ముఖ్యంగా భారతీయులమైన మనం చాలా ఆశిస్తాం. అదే సమయంలో నిలకడగా ఉండాలని కోరుకుంటాం. కానీ వారు కూడా మనుషులే. ప్రతిసారి మంచి ఇన్నింగ్స్ ఆడలేరు. కొన్నిసార్లు మాత్రమే అలా జరుగుతుంది. వారు తిరిగి ఫామ్‌లోకి వస్తారు’ అని రవిశాస్త్రి వివరించారు.
ఇదిలా ఉండగా, కివీస్ టూర్‌కు విశ్రాంతి తీసుకున్న రోహిత్, కోహ్లీ.. డిసెంబరు 4 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నారు. కోహ్లీ, రోహిత్ వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసేందుకు మరో 86 పరుగుల దూరంలో ఉన్నారు. బంగ్లా టూర్‌లో ఈ ఘనతను సాధించే అవకాశముంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం
-
Ts-top-news News
MLC Kavitha: కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ
-
Ts-top-news News
Indian Railway: రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
Ap-top-news News
CM Jagan: సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు.. ఇప్పుడు చిక్కులు..