Ravi shastri: టీమిండియా కోచ్‌గా చేయగలిగినంతా చేశా : రవిశాస్త్రి

టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన మ్యాచే టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రికి చివరిది. ఈ సందర్భంగా తనను..

Updated : 09 Nov 2021 10:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన మ్యాచే టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రికి చివరిది. ఈ సందర్భంగా తనను టీమిండియా కోచ్‌గా నియమించిన అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసన్‌కి శాస్త్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో శ్రీనివాసన్ తనపై నమ్మకంతో.. జట్టును బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించాడని పేర్కొన్నాడు.    

‘ఇన్నేళ్లుగా టీమిండియా కోచ్‌గా కొనసాగడం గొప్ప విషయం. డ్రెస్సింగ్ రూమ్‌లో నాకు ఇదే చివరి రోజని తెలుసు. భారత క్రికెట్‌కు సేవలందించే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. కోచ్‌గా నేను చేయగలిగినంతా చేశాననుకుంటున్నాను. నా సామర్థ్యంపై నమ్మకంతో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన శ్రీనివాసన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నా పనితీరుపై ఆయనకు నమ్మకమెక్కువ. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

2014లో టీమిండియా డైరెక్టర్‌గా నియమితుడైన రవిశాస్త్రి.. 2017లో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత 2019 ఆగస్టులో మరోసారి అతడి పదవీ కాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని