
Ravichandran Ashwin: భారత టీ20 లీగ్ చరిత్రలో అశ్విన్ తొలి రిటైర్డ్ ఔట్
(Photo: Ravichandran Ashwin Instagram)
ముంబయి: వాంఖడే వేదికగా గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ టోర్నీ చరిత్రలో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అతడు ఇలా పెవిలియన్ చేరాడు. అలసిపోయి షాట్లు ఆడలేకపోతుండటంతో అశ్విన్ వెనుదిరిగి ఉండొచ్చని తెలుస్తోంది. రిటైర్డ్ ఔట్ అనేది ఓ వ్యూహాత్మక ఎత్తుగడ. మెరుగైన ముగింపు కోసం రాజస్థాన్ జట్టు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. రిటైర్డ్ హర్ట్ అయిన బ్యాటర్లా.. రిటైర్డ్ ఔట్ అయిన బ్యాటర్ తిరిగి బ్యాటింగ్ రావడానికి వీల్లేదు. అశ్విన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన పరాగ్ ఓ సిక్స్ కొట్టడం గమనార్హం. చివరికి రాజస్థాన్ 20 ఓవర్లకు 165/6 స్కోర్ చేసింది. అశ్విన్ (28; 23 బంతుల్లో 2x6), షిమ్రన్ హెట్మయర్ (59 నాటౌట్; 36 బంతుల్లో 1x4, 6x6) పరుగులు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లకు 162/8 స్కోరుకే పరిమితమైంది. క్వింటన్ డికాక్ (39; 32 బంతుల్లో 2x4, 1x6), మార్కస్ స్టాయినిస్ (38 నాటౌట్; 17 బంతుల్లో 2x4, 4x6) గెలిపించే ప్రయత్నం చేశారు. అయినా, చివరికి రాజస్థాన్ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Teegala krishna reddy: మీర్‌పేట్‌ను మంత్రి సబిత నాశనం చేస్తున్నారు: తీగల తీవ్ర ఆరోపణలు
-
Business News
China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
-
Politics News
Kotamreddy: మురుగు కాల్వలో దిగి వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన
-
Sports News
IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
-
India News
Mumbai Rains: జలమయమైన ముంబయి.. మరోసారి భారీ వర్ష సూచన
-
India News
Lalu Prasad Yadav: ‘నాన్న మీరే నా హీరో’ : ఆస్పత్రిలో లాలూ.. భావోద్వేగ పోస్టు పెట్టిన కుమార్తె..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
- Bumrah : బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. SENAపై అదరగొట్టేసిన టీమ్ఇండియా పేసర్