Published : 04 Mar 2022 09:02 IST

Ashwin: ఐదు వికెట్ల దూరంలో అశ్విన్‌.. 38 పరుగుల దూరంలో విరాట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న అతడు.. మరో ఐదు వికెట్లు తీసి రెండో స్థానంలోకి దూసుకెళ్లాలని చూస్తున్నాడు. అందుకు శ్రీలంకతో జరిగే తొలి టెస్టునే వేదికగా మలచుకోవాలని భావిస్తున్నాడు. టీమ్‌ఇండియా తరఫున ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అనిల్‌కుంబ్లే (619) అందరికన్నా ముందున్నాడు. తర్వాత దిగ్గజ క్రికెటర్‌, మాజీ సారథి కపిల్‌దేవ్‌ (434) ఉన్నాడు. ఇక అశ్విన్‌ (430) వికెట్లతో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు కొత్త రికార్డు నెలకొల్పాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

38 పరుగుల దూరంలో విరాట్‌..

మరోవైపు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఈ టెస్టుతో రెండు గొప్ప రికార్డులు నెలకొల్పనున్నాడు. ఈ మ్యాచ్‌ అతడికి వందో టెస్టు కానుండటం ఒక విశేషమైతే.. మరో 38 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 8000 పరుగుల మైలురాయి చేరుకునే మరో అరుదైన అవకాశం దక్కనుంది. ఈ జాబితాలో సచిన్‌ (15,921), ద్రవిడ్‌ (13,265), గావస్కర్‌ (10,122), లక్ష్మణ్‌ (8,781), వీరేందర్‌ సెహ్వాగ్‌ (8,503).. కోహ్లీ (7,962) కన్నా ముందున్నారు. అలాగే విరాట్‌ ఒకవేళ సెంచరీ సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో రికీ పాంటింగ్‌ (71) సరసన నిలుస్తాడు. ఇక్కడ కూడా సచిన్‌ (100) నంబవర్‌ వన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని