Published : 26 May 2022 01:24 IST

Ashwin : టీమ్‌ఇండియా మాజీ కోచ్ ఇచ్చిన సలహా ఇదే: రవిచంద్రన్ అశ్విన్‌

ఇంటర్నెట్ డెస్క్‌ : పన్నెండేళ్ల కిందట అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టులో అశ్విన్‌ సభ్యుడు. టెస్టు క్రికెట్‌లో ఇటీవల కపిల్ దేవ్‌ను వెనక్కి నెట్టి అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా మారాడు. భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లు ఆడుతున్న అశ్విన్‌ టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ జట్టుకు ఆడుతున్నాడు. ఆటతోపాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే అశ్విన్‌ తన కెరీర్‌ ప్రారంభంలో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ ఇచ్చిన సలహా వర్కౌట్‌ అయిందని పేర్కొన్నాడు.

‘‘నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో పొరపాట్లు చేశా. అప్పట్లో టీమ్‌ఇండియాకు ప్రధాన కోచ్‌గా డంకన్ ఫ్లెచర్‌ ఉన్నారు. ఆయన దగ్గరకు వెళ్లి నేను ఎలా మెరుగవ్వాలి..? బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా అన్నింట్లో ఏ విధంగా ఇంప్రూవ్‌ కావాలని అడిగేవాడిని. అయితే ఫ్లెచర్‌ ఒకే మాట చెప్పేవాడు.. నువ్వు బెటర్‌గా తయారు కావాలంటే తప్పులు చేస్తూనే ఉండాలి. ప్రజల ముందు విఫలమవుతూ ఉండాలి. ఇదే ఆయన చెప్పిన సూత్రం. నా జీవితంలో ఇలాంటివి ఎన్నో చూశా. అభిమానుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ‘అసలు ఎందుకు అతడు (అశ్విన్‌ గురించి) ఇలా చేస్తున్నాడు?’ అని ఒక్కోసారి  ప్రజలు అనుకునేవారు. అలాంటి వాటన్నింటి నుంచి బయటపడేందుకు తీవ్రంగా కృషి చేశా. అందుకే నేను చాలా సమస్యలను అధిగమించా’’ అని అశ్విన్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని